బిజినెస్

అప్పులన్నీ తీర్చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 29: భారత దేశంలోని బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ నూటికి నూరుశాతం తీర్చేస్తానని ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న ‘లిక్కర్ కింగ్’ విజయ్ మాల్యా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా అతను ఇదివరకు చాలాసార్లు ఇలాంటి ప్రకటన చేశాడు. మాల్యాను భారత్‌కు అప్పగించే అంశాన్ని హైకోర్టు పరిశీలనలో ఉంది. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిలను ఎగ్గొట్టి, దేశం నుంచి పారిపోయినట్టు బ్రిటిష్ ప్రభుత్వానికి భారత్ ఇది వరకే స్పష్టం చేసింది. అతను చేసిన మోకాలు, అక్రమాల చిట్టాను కూడా అందించింది. అతనిని వెంటనే అప్పగించాల్సిందిగా కోరింది. దీనిపై స్కాట్‌లాండ్ యార్డ్ స్పందిస్తూ, 2017 ఏప్రిల్‌లో అప్పగింత వారెంటును జారీ చేసింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌కు వెళ్లక తప్పదని తెలుసుకున్న మాల్య కొత్త ఎత్తులు వేశారు. భారత్‌లో తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, కోర్టును ఆశ్రయించారు. భారత అధికారుల తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) కేసును వాదించింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో మాల్యాను భారత్‌కు పంపించేయాలంటూ వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు కేసును విచారించింది. భారత్ సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం మాల్యా మోసాలకు, అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారించింది. అతనిని భారత్‌కు పంపాలని చీఫ్ మెజిస్ట్రే ఎమ్మా అర్బుత్‌నట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో యునైటెడ్ కింగ్‌డమ్ హోం సెక్రెటరీ సాజిద్ జావిద్ సైతం మాల్యను భారత్‌కు అప్పగించాలనే పత్రంపై సంతకం చేశారు. కాగా, తాను ఎలాంటి మోసాలకు, అక్రమాలకు పాల్పడలేదని, కానీ, తనకు ప్రాణహాని ఉందని మాల్యా వ్యక్తం చేసిన అభ్యంతరాలను యూకే హైకోర్టు పరిశీలిస్తున్నది. జూలై రెండో తేదీన కోర్టు తీర్పును ఇవ్వనుంది. ముంచుకొస్తున్న ‘అప్పగింత’కు భయపడుతున్న మాల్య తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని అణాపైసలతో సహా ఇచ్చేస్తానని ఇది వరకే పలుమార్లు ప్రకటించారు. తాజాగా జెట్ ఎయిర్‌లైన్స్ మూసివేత ఖాయమైన నేపథ్యంలో మాల్య స్పందిస్తూ, తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఎఫ్‌ఏ) సైతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొందని వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రైవేటు విమానయాన సంస్థలన్నీ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని, జెట్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే ఇందుకు ఉదాహర్ అని ట్వీట్ చేశారు. ‘జెట్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని సాధారణ వ్యాపార నష్టంగానే పరిగణించాల్సి ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే, ఆ వ్యాపా రం నష్టపోయింది. భారత్‌లో ఎన్నో ప్రైవేటు విమానయాన సంస్థలు కుప్పకూలుతున్నాయి. వాటిలో కేఎఫ్‌ఏ కూడా ఉంది. అయితే, కేఎఫ్‌ఏకు చెందిన బ్యాంకు రుణాలను చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ, బ్యాంకులు అంగీకరించడం లేదు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మరోవైపు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నాపై క్రిమినల్ కేసులు పెట్టిం ది. అక్రమాలు, మోసాలు చేసినట్టు చిత్రీకరిస్తున్నది. ఇది ఎంతో బాధాకరం. నిజానికి నేను అప్పులన్నింటినీ తీర్చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని మాల్య ట్విటర్ మెసేజ్‌లో పేర్కొన్నారు.
చిత్రం... విజయ్ మాల్యా