బిజినెస్

రూ. 20 కోట్ల రుణాలు సేకరించిన వన్ ఇండియా మార్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: రీటైల్ చైన్ సంస్థ వన్ ఇండి యా మార్ట్ 20 కోట్ల రూపాయల రుణాలు సేకరించింది. ఏపీఏసీ ఫైనాన్షియల్ సిర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్టు వన్ ఇండియా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్ట్‌లను విస్తరించడానికే ఈ రుణాలను సేకరించినట్టు నిసా రిటైల్‌కు చెందిన వన్ ఇండియా తన ప్రకటనలో వివరించింది. కంపెనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం తమకు ఉందని కంపెనీ చీఫ్ ఫైనాన్షిల్ ఆఫీసర్ దీపక్ శర్మ తెలిపారు. భారీగా సేకరించి రుణాలతో, వచ్చే రెండేళ్లలో కంపెనీని రిటైల్ చైన్ రంగంలో అగ్రగామిగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. దేశ తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని 81 నగరాల్లో ప్రస్తుతం ఈ సంస్థ 90 స్టోర్లను నడిపిస్తున్నది. ఈ ఏడాది మరో 40 స్టోర్లను తెరుస్తామని దీపక్ శర్మ తెలిపారు. 2020లో 50 స్టోర్లకు తెరుస్తామన్నారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 400 కోట్ల రూపాయలని ఆయన వివరించారు.