బిజినెస్

హెచ్‌పీసీఎల్‌లో ఎంఆర్‌పీఎల్ విలీనానికి బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: హిందుస్థాన్ పెట్రోలియన్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ విలీనానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వాటాలను పూర్తిగా తుడిచేయాలన్న ప్రతిపానను భారత చమురు, సహజ వాయివు కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) తిరస్కరించినట్టు సమాచారం. గత ఏడాది హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్‌జీసీ 36,915 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. దీనితో ఓఎన్‌జీసీ వద్ద హెచ్‌పీసీఎల్, ఎంఆర్‌పీఎల్ రూపంలో రెండు రిఫైనరీ అనుబంధ కంపెనీలు ఉన్నాయి. ఇలావుంటే, ఎంఆర్‌పీఎల్‌ను విలీనం చేసుకోవడం ద్వారా, ప్రపంచంలోనే చమురు రిఫైనర్‌ల జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమించాలని హెచ్‌పీసీఎల్ పట్టుదలతో ఉంది. ఇందుకుగాను ఎంఆర్‌పీఎల్ వాటాలను పూర్తిగా తీసేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఆమోదం కూడా ఓఎన్‌జీసీకి పంపింది. అయితే, వాటాల తుడిచివేత కంటే, నగదు రూపంలో లావాదేవీలు పూర్తికావాలని ఓఎన్‌జీసీ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. హెచ్‌పీసీఎల్ షేర్ల ధర పతనమవుతున్న కారణంగా, వాటిని కొనుగోలు చేయడం సరైన విధానం కాదన్నది ఓఎన్‌జీసీ వాదన. గత ఏడాది జనవరిలో, హెచ్‌పీసీఎల్‌లో ప్రభుత్వ వాటా 51.11 శాతాన్ని ఓఎన్‌జీసీ ఒక్కో వాటాకు 473.97 రూపాయలు చెల్లించి కొన్నది. అయితే, ఇటీవల స్టాక్ మార్కెట్‌లో హెచ్‌పీసీఎల్ వాటా ధర 282.60 రూపాయలకు పడిపోయింది. అంటే, సుమారు 15 నెలల కాలంలో ఈ కంపెనీ షేర్ల ధర 40 శాతం పతనమైంది. ఇలావుంటే, ఎంఆర్‌పీఎల్‌ను విలీనం చేసుకోవడానికి అనుసరించబోయే స్పష్టమైన ప్రణాళిక ఏదీ హెచ్‌పీసీఎల్ వద్ద లేదు. ఆయిల్ మినిస్ట్రీ ద్వారా లేదా మీడియా ద్వారా విలీనం ప్రతిపాదనలను చేస్తున్నది. వాటాల కొనుగోళ్ల రూపంలో విలీనం ప్రక్రియ జరగాలన్న అభిప్రాయాన్ని ఓఎన్‌జీవీ వద్ద వ్యక్తం చేసింది. అయితే, హెచ్‌పీసీఎల్ వాటాలను కొనుగోలుచేసి చేతులు కాల్చుకున్న ఓఎన్‌జీసీ, అప్పుడు అదే కంపెనీ మరోసారి వాటాల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ప్రతికూలంగా స్పందిస్తున్నదని విశ్వసనీయ సమాచారం. ఏదో ఒక విధానంలో ఎంఆర్‌పీఎల్ విలీనం పూర్తయితే, హెచ్‌పీసీఎల్ రిఫైనరీ రంగంలో ప్రపంచ గుర్తింపును సంపాదిస్తుంది. ఆతర్వాత ఆ కంపెనీ స్టాక్స్‌కు డిమాండ్ ఏర్పడడం ఖాయం.