బిజినెస్

నిరర్ధక ఆస్తులను ప్రకటించొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించలేక, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) ఖాతాలను పరిశీలించి, నిరర్ధక ఆస్తులును ప్రకటించవచ్చని బ్యాంకులకు నేషనల్ లా అపెలైట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. చైర్మన్ జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయతో కూడిన ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ గురువారం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఖాతాలను నిరర్ధక ఆస్తుల కింద పరిగణించడానికి గతంలో బ్యాంకులపై విధించిన ఆంక్షలను బెంచ్ ఎత్తివేసింది. అయితే, ఆ కంపెనీ, దాని అనుబంధ సంస్థల నుంచి బకాయిల వసూళ్లను చేపట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియపై స్పష్టత వచ్చేవరకూ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు రుణాలనిచ్చిన బ్యాంకులు సహకారాన్ని అందించాల్సిందేనని ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ పేర్కొంది. ఈ గ్రూప్ వివిధ బ్యాంకుల నుంచి 90,000 కోట్ల రూపాయల రుణాలను తీసుకుంది. వాటిని చెల్లించలేక చేతులెత్తేసింది. కంపెనీ ఆస్తులను అమ్మేయడమా లేక సమర్థులైన బిడ్డర్‌కు అప్పచెప్పడమా అనే అంశంపై రుణదాతల కమిటీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ప్రతినిధుల బృందం చర్చలు జరుపుతున్నాయి. రిజల్యూషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు సం బంధించిన ఖాతాలు, ఇతరత్రా అంశాలపై ఎలాం టి ప్రకటనలు చేయడానికి వీల్లేదని ఎన్‌సీఎల్‌ఏటీ ఆంక్షలు విధించింది. వాదోపవాదనల తర్వాత ఆ కంపెనీ ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించేందుకు బ్యాంకులకు అనుమతిచ్చింది.