బిజినెస్

స్టాక్ మార్కెట్‌కు స్వల్ప నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 2: స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప నష్టాల్లో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 50.12 పాయింట్లు (0.13 శాతం) పతనమై, 38,981.43 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 23.40 పాయింట్లు (0.20 శాతం) తగ్గడంతో 11,724.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఈక్విటీ కీలకాంశాలు ప్రతికూల పరిస్థితుల్లో కొనసాగడంతో భారత స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. బీఎస్‌ఈలో సెనె్సక్స్ ఒకానొక దశలో సుమారు 300 పాయింట్లు పతనమైంది. దీనితో 38,882.99 పాయింట్ల వద్ద మార్కెట్ ముగుస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. కానీ, ఆతర్వాత దేశీయ మదుపరులు ఆదుకోవడంతో పరిస్థితి మెరుగుపడింది. లాభాలు రాకపోయినా, భారీ నష్టాలపాలు కాకుండా మార్కెట్ కొద్దిపాటి పతనంతో బయటపడింది. బీఎస్‌ఈలో టాటా మోటర్స్ షేర్లు అత్యధికంగా, 3.29 శాతం నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్రిటానియా కంపెనీ స్టాక్స్ 4.01 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి. మార్కెట్‌లో ప్రతికూల వాతారణం కనిపించినప్పటికీ, బీఎస్‌ఈలో ఎస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. 3.45 శాతం లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్ (1.88 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (1.66 శాతం), హీరో మోటార్స్ (1.55 శాతం), బజాజ్ ఆటో (1.46 శాతం) కంపెనీల వాటాలు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే, టాటా మోటార్స్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ (3.23 శాతం), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (2.81 శాతం), ఇన్ఫోసిస్ (2.68 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (1.98 శాతం) నష్టాలను ఎదుర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రా 3.60 శాతం, ఎస్ బ్యాంక్ 3.57, పవర్‌గ్రిడ్ 2.04 శాతం, హీరో మోటార్స్ 1.72 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.66 శాతం చొప్పున లాభపడ్డాయి. బ్రిటానియా కంపెనీ షేర్ల ధర దారుణంగా పతనంకాగా, జీ ఎంటర్‌టైనె్మంట్ (3.57 శాతం), టాటా మోటార్స్ (3.45 శాతం), ఇండస్‌ఇండ్ (3.17 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (3.13 శాతం) కంపెనీల స్టాక్స్ కూడా నష్టాలను చవిచూశాయి.