బిజినెస్

లక్ష్యాలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా బొగ్గు అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున 2019-2020 నాటికి 700 లక్షల టన్నుల బొగ్గును ఉత్పిత్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ అధికారులను ఆదేశించారు. గురువారం సింగరేణి భవన్‌లో బోర్డు డైరెక్టర్లలు, జనరల్ మేనేజర్లుతో సీఎండీ భేటీ అయ్యారు. సీఎండీ శ్రీధర్ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తిలక్ష్యం కోసం ఇప్పటి నుంచే అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పాత గనులు మూతపడుతున్నందున కొత్తవాటి కోసం అనే్వషణ ప్రారంభించాలని అన్నారు. అదనపుభారం తొలగింపు లక్ష్యాల మేరకు జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఓబీ కాంట్రాక్టర్లతో పాటు కంపెనీ మిషనరీతో కూడా లక్ష్యాలను సాధించాలన్నారు. గత ఏడాది భూగర్భ గనుల్లో నష్టాలు తగ్గాయని, అయినా ఇంకా తగ్గించాలన్నారు. బొగ్గు రవాణాకు తగిన స్థాయిలో కొత్త సీహెచ్‌పీల నిర్మాణం, పాత వాటిని ఆధునీకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరేణి ఆధ్వర్యంలో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకు సంబంధించి జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారు. అనుకున్న సమయానికి నైనీ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి జరగాలన్నారు. సింగరేణిలో తొమ్మిది ఏరియాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల పనులు వేగవంతం చేయాలని సూచించారు. నవరత్న, మహారత్న కంపెనీలకు ధీటుగా సింగరేణిని అభివృద్ధి చేయాలని అధికారులకు చెప్పారు. నెలవారీగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ లక్ష్యాలను సమీక్షించుకోవాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, భాస్కరరావు, బలరాం, ఈడీలు అల్విన్, డీఎన్ ప్రసాద్, మార్కెటింగ్ జీఎంలు అంటోనీరాజా, రాజేశ్వర్‌రెడ్డి, నాగేశ్వరరావు, రవిశంకర్, జీకే మూర్తి, జేవీఎల్ గణపతి, సింగరేణి పీఆర్‌వోమహేష్ పాల్గొన్నారు.

చిత్రం... సింగరేణి సీఎండీ శ్రీ్ధర్