బిజినెస్

ప్రపంచ ఆర్థిక వృద్ధి మెరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 4: అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సంబంధిత వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు పెరిగే సూచనలు కనిపించవచ్చునని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ బ్యాంకర్లు వడ్డీ రేట్లను సరళతరం చేయడం వృద్ధి రేటు పెరిగేందుకు దోహదపడుతుందని వారు చెబుతున్నారు. ఇప్పటికీ అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో వృద్ధి రేటు పెరిగేందుకు తద్వారా వాణిజ్య, వ్యాపారాల్లో ఎదురవుతున్న ప్రతిబంధకాలను నిరోధించేందుకు వ్యూహాత్మక ఆలోచనా దృష్టితో ముందుకు సాగుతామని జపాన్ ఆర్థిక మంత్రి టారో ఆసో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన గ్రూపునకు జపాన్ నాయకత్వం వహిస్తోంది. గత ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది ప్రథమార్థంలో సైతం జరిగిన వాణిజ్య యుద్ధం కారణంగా మరింత దిగజారిందని, దీని ప్రభావం వాణిజ్య మార్కెట్లతోపాటు వడ్డీ రేట్ల పెంపుపై తీవ్ర ప్రభావం చూపిందని జీ-20 సమావేశంలో పాల్గొన్న అధికారులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది 3.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, ఈ ఏడాది 3.3 శాతం నమోదైంది. ఈ వ్యత్యాసం 2009 నుంచి తగ్గుతూ వస్తున్నా 2020 నాటికల్లా మళ్లీ 3.6 శాతం వృద్ధి రేటు పెరగవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని బ్యాంక్ ఆఫ్ జపాన్ హెడ్ హరుహికో కురోడా సైతం మీడియాతో మాట్లాడుతూ ఐఎంఎఫ్ సూచనల మేరకు రానున్న కాలంలో వృద్ధి రేటు మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అయితే, అమెరికా-చైనా వాణిజ్య సంఘర్షణపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అగ్ర రాజ్యాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణం వల్ల 350 బిలియన్ డాలర్ల మేరకు సుంకాల రూపంలో నష్టం వాటిల్లుతోంది. అయితే, ఈ ఏడాది అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్యపరంగా తలెత్తుతున్న విభేదాలు సమసిపోయి మళ్లీ మార్కెట్ బలపడుతుందనే ఆశాభావాన్ని పలు ఆర్థిక సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.