బిజినెస్

దిగుమతులే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: ముడిచమురు దిగుమతులను కనీసం 10 శాతం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నా ఫలితం దక్కడంలేదు. పలు అవసరాల కోసం పెట్రోలియం ఉత్పత్తులను దేశం భారీగా దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో 84 శాతం ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారిక లెక్కలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 2015 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక సదస్సులో మాట్లాడుతూ చమురు దిగుమతులు గణనీయంగా తగ్గిస్తామని అన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న చమురు 77 శాతంగా నమోదైంది. 2022 నాటికి దీనిని కనీసం 10 శాతం, (67 శాతం) తగ్గిస్తామని మోదీ అప్పట్లో హామీ ఇచ్చారు. అంతేకాక, 2030 నాటికి 50 శాతం కంటే ఎక్కువ దిగుమతులు ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పెట్రోలు తదితర ఇంధన వాడకం దేశంలో విపరీతంగా పెరిగినప్పటికీ ఉత్పత్తులు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో 82.9 శాతం పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. 2018-19లో ఇది మరింతగా పెరిగి 54 శాతానికి చేరుకుంది. పెట్రోలియం ప్రణాళిక మరియు విశే్లషణ విభాగం (పీపీఏసీ) మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం 2015-16లో దిగుమతులు 184.7 మిలియన్ టన్నుల నుంచి గత ఆర్థిక సంవత్సరానికి 206.2 మిలియన్ టన్నులకు పెరిగాయి. మరోవైపు దేశంలో ఉత్పత్తులు గణనీయంగా పడిపోతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులు 36.9 మిలియన్ టన్నులు కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఇది 36 మిలియన్ టన్నులకు పడిపోయింది. 2017-18లో 35.7, గత ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ టన్నులకు చేరింది. ఆయిల్ ఉత్పత్తులను పెం చడం ద్వారా దిగుమతులను తగ్గించి, విదేశాలపై ఆధారపడడాన్ని నివారించాలని ప్రధాని నరేంద్ర మోదీ విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి అమలు కావడంలేదన్నది తగ్గుతున్న ఉత్పత్తులే నిదర్శనం.