బిజినెస్

వచ్చేది ఎన్డీఏ నేతృత్వ సంకీర్ణ ప్రభుత్వమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 6: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి తమ ప్రగతికి తోడ్పడుతుందని ఆర్థిక సేవల దిగ్గజం ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎల్) సోమవారం నాడిక్కడ పేర్కొంది. సుమారు ఏడాది కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలన్నింటికీ ద్రవ్య లభ్యతకు ఎన్‌డీఏ ప్రభుత్వంలో లభిస్తుందని ఆశిస్తున్నట్టు ఆ కంపెనీ పేర్కొంది. మొత్తం 7 విడతలుగా సాగే సార్వత్రిక ఎన్నికల్లో ఐదో దఫా పోలింగ్ సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 23న వెలువడే ఫలితాల్లో ఎన్‌డీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తిగిరి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఐఐఎఫ్‌ఎల్ పేర్కొంది. ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కూర్చుని చర్చించి ద్రవ్యలోటు సమస్యను పరిష్కరిస్తాయని ఇప్పటికే తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఐఐఎల్‌ఎఫ్ చైర్మన్ నిర్మల్ జైన్ సోమవారం నాడిక్కడ జరిగిన కంపెనీకి చెందిన ఓ కార్యక్రమంలో విలేఖరులకు తెలిపారు. తదుపరి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు మరిన్ని భాగస్వామ్య పార్టీల అవసరం ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ వ్యాఖ్యానించడాన్ని నిర్మల్ జైన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.