బిజినెస్

వ్యాపార దిగ్గజం దేవేశ్వర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐటీసీ అంటే ఒకప్పుడు వివిధ బ్రాండ్లతో సిగరెట్లు ఉత్పత్తి చేసే కంపెనీగానే అందరికీ తెలిసేది. పొగాకు ఉత్పత్తులకు మాత్రమే పరిమితమైన ఐటీసీ మిగతా రంగాల్లోనూ వేళ్లూనుకుంటుందని, వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఎవరి అంచనాలకు అందని రీతిలో వైసీ దేవేశ్వర్ ఐటీసీ రూపురేఖలు మార్చేశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా, చైర్మన్‌గా ఐటీసీకి విశిష్ట సేవలు అందించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఐటీసీకి మార్గనిర్దేశనం చేశాయి. ఆ సంస్థకు అత్యధిక కాలం సీఈవోగా సేవలు అందించిన అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన హయాంలోనే ఎఫ్‌ఎంసీజీ, హాస్పిటాలిటీ, ఐటీ తదితర రంగాల్లోకి ఐటీసీ అడుగుపెట్టింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ లాభాలను ఆర్జించింది. ఆయన ఐటీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే సమయానికి కంపెనీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. విస్తరణ ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. సిగరెట్ల తయారీపై వచ్చిన లాభాలు కంపెనీని ఆదుకున్నాయి. 1990 దశకం చివరిలో ఈ కంపెనీ ఆదాయం 5,200 కోట్ల రూపాయలు. పన్ను చెల్లించడానికి ముందు లాభం 452 కోట్ల రూపాయలు. దేవేశ్వర్ మార్గదర్శకంలో అసాధారణ విజయాలతో దూసుకెళ్లింది. ఎఫ్‌ఎంసీజీ, హాస్పిటాలిటీ, పేపర్, ఐటీ, వ్యవసాయం తదితర రంగాల్లోకి విస్తరించింది. ఎవరూ ఊహించని రీతిలో ఎదిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 44,329.77 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించగలిగింది. నికర లాభం 11,223.25 కోట్ల రూపాయలు. దేవేశ్వర్ ప్రతిభాపాటవాలను ఈ గణాంకాలే స్పష్టం చేస్తాయి. ఆయన మృతితో దేశం ఒక గొప్ప దార్శనికుడిని కోల్పోయింది. ఆయన స్ఫూర్తితో ఐటీసీ భవిష్యత్తులోనూ ఇదే రీతిలో లాభాలబాటలో నడుస్తుందని ఆశిద్దాం.