బిజినెస్

రేణిగుంట - కొల్హాపూర్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మే 12: మహారాష్టల్రోని కొల్హాపూర్‌కు రేణిగుంట విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభించారు. ఇండిగో విమానయాన సంస్థ ఇప్పటికే రేణిగుంట మీదుగా ఆరు సర్వీసులు నడుపుతోంది. 7వ సర్వీసును మహారాష్ట్ర రాష్ట్రంలో పేరుగాంచిన పుణ్యక్షేత్రం మహాలక్ష్మీ ఆలయం ఉన్న కొల్హాపూర్‌కు ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సురేష్, సీఐఎస్‌ఎఫ్ సీఏఎస్‌ఓ డీసీ శుక్లా, ఏపీఎం ఇండిగో వినయ్‌బజాజ్, డీజీఎం సీఎన్‌ఎస్ నరసింహన్, టర్మినల్ మేనేజర్ గోపాల్ పాల్గొన్నారు.

చిత్రం... కొల్హాపూర్‌కు కొత్త విమాన సర్వీసును ప్రారంభిస్తున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు