బిజినెస్

ఆన్‌లైన్ రిటైల్ వ్యాపార విస్తరణపై రిలయన్స్ ఇండస్ట్రీస్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: దేశంలో అత్యంత ఐశ్వర్య వంతుడైన ముఖేష్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా డిజిటలైజ్డ్ రీటైల్ స్టోర్లను గణనీయంగా విస్తరించనుంది. ప్రస్తుతం నడుస్తున్న 15 వేల డిజిటలైజ్డ్ రీటైల్ స్టోర్లను 2023 నాటికి 5 మిలియన్ సోర్లకు విస్తరించాలని ఆ కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని అమెరికాకు చెందిన బ్యాంక్ ‘మెర్రిల్ లించ్’ జరిపిన అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశంలోని సుమారు 70 బిలియన్ డాలర్ల విలువైన 90 శాతం రిటైల్ మార్కెట్ అసంఘటిత రంగంలో కొనసాగుతోంది. ప్రధానంగా ఆహార వస్తువులు, ధాన్యాలు వంటివి విక్రయించే కిరాణా దుకాణాలు ఇందులో ఉన్నాయి. ఈ కిరాణా దుకాణాలన్నీ సాంకేతికంగా అభివృద్ధిచెంది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అప్‌గ్రేడ్ కావాడం ద్వారా ఆధునికతను సంతరించుకోవాల్సి ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. మారిన కాలంలో పెరిగిన పోటీని తట్టుకోవాలంటే ఈకామర్స్ వంటి ఆధునికతలను సంతరించుకోక తప్పదని నివేదిక పేర్కొంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడం కూడా డిజిటలైజేషన్‌లో భాగమైందని, ప్రధానంగా జీఎస్‌టీ బిల్లుల జనరేషన్‌లో ప్రవేశపెట్టిన ఆధునిక విధానం సైతం వాణిజ్య డిజిటలైజేషన్ నిర్బంధ అమలుకు దోహం చేస్తోందని తెలిపింది. ఇలావుండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో పాన్ ఇండియాతో అనుసంధానమై నడుస్తున్న 10వేల రిటైల్ ఔట్‌లెట్లు ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ టు ఆన్‌లైన్ ఈ కామర్స్ వేదికగా మారింది. ఈక్రమంలో ఈ కంపెనీ నిర్వహణలో దేశ వ్యాప్తం గా ఉన్న అన్ని కిరాణా సోర్లకు ‘జియో ఎంపీఓ’ (మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్) డివైస్‌లను ఏర్పాటుచేయనుంది. పరిసర ప్రాంతాల్లోని సరఫరాదారులకు హైస్పీడ్ 4జీ నెట్‌వర్క్ ద్వారా సేవలందించనుంది. వినియోగదారులు ఈ సేవలను ఆర్డర్లను చేయవచ్చని ఆ అధ్యయన నివేదిక తెలిపింది. ప్రధానంగా స్నాప్‌బిజ్, నుక్కాడ్ షాప్స్, గోఫ్రూగల్‌లలో ఈ ఎంపీఓలను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది.