బిజినెస్

ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ త్రైమాసిక లాభాలు రూ.373 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ముంబయికి చెందిన మాజీ ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్, ప్రస్తుత ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ సంస్థ గత మార్చి నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో సుమారు 30 శాతం వృద్ధితో రూ. 373 కోట్ల లాభాలను గడించినట్టు సంస్థ వెల్లడించింది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 32 శాతం పెరిగి రూ. 965 కోట్ల నుంచి రూ. 1,276 కోట్లకు పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్థూల ఆదాయం 16 శాతం వృద్థితో రూ.4,305 కోట్లు వచ్చిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కీలక ప్రాధాన్యత గల వ్యాపారాన్ని బలోపేతం చేయడంలో సఫలీకృతం అయ్యామని కంపెనీ పేర్కొంది. ప్రధానంగా గ్రూపుచర్చల ద్వారా నిర్ణయాలు తీసుకుని ఫైనాన్స్, సంపద, సెక్యూరిటీల వృద్ధిపై స్వేచ్ఛగా చర్యలు చేపట్టేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపింది. మంచి మార్జిన్లతో ఫైనాన్స్ వ్యాపారాభివృద్ధి జరిగిందని, బలమైన రీటైల్ ఫ్రాంచైస్, సాంకేతికత ద్వారా ఇది సంభవం అయిందని ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ చైర్మన్ నిర్మల్ జైన్ పేర్కొన్నారు. రుణ ఆస్తుల నిర్వహణ (ఏయూఎం), రీటైల్ విభాగాల్లో ఇయర్ ఆన్ ఇయర్ విధానంలో 29 శాతం వృద్ధి నమోదైందని రూ. 34,904 కోట్లు ఖర్చయినట్టు వివరించింది. చిన్న చిన్న గృహ రుణాలు, బంగారు వస్తువులపై రు ణాలు, చిన్న, మధ్య తరహా (ఎస్‌ఎమ్‌ఈ) పరిశ్రమలకు రు ణాలు, కార్పొరేట్ సంస్థల రుణాలకు ప్రాధాన్యతనిచ్చామని జైన్ తెలిపారు. 2019 మార్చి నాటికి కంపెనీ సంపద, ఆస్తు లు మొత్తం విలువ రూ. 1,69,312 కోట్లకు చేరిందని, ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 28 శాతం అధికమని తెలిపారు. అలాగే నిరర్థక ఆస్తులు మొత్తం రుణాలపై 1.9 శాతం ఉన్నాయని, మార్చి 2019 నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 0.6 శాతమని కంపెనీ తెలిపింది. కాగా బుధవారం స్టాక్ మార్కె ట్లో ఈ కంపెనీ వాటాలు దాదాపు 0.90 శాతం లాభపడ్డాయి. ఒక్కో వాటా ధర రూ.431.25 వంతున ట్రేడయ్యాయి.