బిజినెస్

కోలుకున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, మే 16: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) గురువారం నష్టాల నుంచి కోలుకుంది. బుధవారం నష్టాలపాలైన స్టాక్ మార్కెట్ గురువారం ఆశాజనకమైన పరిస్థితుల నేపథ్యంలో ఊపిరి పీల్చుకుంది. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 278.60 పాయింట్లు పెరిగి 37,393.48 పాయింట్లకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 100.10 పాయింట్లు లాభ పడడంతో 11,257.10 పాయింట్లుగా నమోదయింది. అంతర్జాతీయ సూచీలు, ఆశయ మార్కెట్లు అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ లాభాల బాటలో నడవడం విశేషం. బీఎస్‌ఈలో బజాజ్ ఫైనాన్స్ షేర్లు అత్యధికంగా, 3.64 శాతం లాభపడ్డాయి. టాటా మోటార్స్ 3.48, ఇన్ఫోసిస్ 2.47, వేదాంత 2.22, ఓఎన్‌జీసీ 2.00 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. అయితే ఎస్ బ్యాంక్ షేర్లు 4.07 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి. భారతీయ ఎయిర్‌టెల్ 1.87, ఇండస్‌ఇండ్ 1.37, కోల్ ఇండియా 1.29. ఐటీసీ 0.81 శాతం చొప్పున నష్టపోయాయి. నిజానికి గురువారం ఉదయం ట్రెడింగ్ భారీ నష్టాల్లో జరిగింది. మధ్యాహ్నం వరకు అదే పరిస్థితి కొనసాగింది. సాయంత్రం కొంత మెరుగు పడ్డప్పటికీ హఠాత్తుగా మళ్లీ పతనమైంది. అయితే చివరి క్షణాల్లో దేశీయ మదుపరులు స్టాక్స్ కొనుగోళ్లపై ఆసక్తి చూపడంతో మళ్లీ లాభాల పాట పట్టింది. మొత్తం మీద మార్కెట్‌లలో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ బీఎస్‌ఈ నష్టాల బారిన పడకుండా తప్పించుకుంది. ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు భారీగా 9.11 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బీపీసీఎల్ 4.85, బజాజ్ ఫైనాన్స్ 4.04, ఐఓసీ 3.88, అల్ట్రా టెక్ 3.86 శాతం చూప్పున లాభాలు ఆర్జించాయి. కాగా, ఎస్ బ్యాంక్ షేర్లు 3.32 శాతం నష్టపోయాయి. అదే విధంగా భారతీ ఎయిర్‌టెల్ 2.26, ఇండస్‌ఇండ్ 1.62, సిప్లా 1.18, కోల్‌ఇండియా 0.94 శాతం చొప్పున నష్టపోయాయి. స్థూలంగా చూస్తే సెనె్సస్ మాదిరగానే నిఫ్టీ కూడా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.