బిజినెస్

మండుతున్న గుడ్డు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 19: సాధారణంగా ఉత్పత్తి పెరిగితే.. వాటి ధరలు తగ్గుముఖం పడుతాయి. షాద్‌నగర్‌లో నియోజకవర్గంలో కోడిగుడ్ల ఉత్పత్తి పెరిగినా..వాటి ధరలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కోడిగుడ్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు సిండికేట్‌గా మారి ఉన్న రేటుకు రెండింతలు చేసి విక్రయిస్తున్నారు. స్థానిక గుడ్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి పౌల్ట్ఫ్రిం వద్దకు నేరుగా చేరుకొని రూ.2.75 కొనుగొలు చేసి నేరుగా మార్కెట్‌లో వినియోగదారులకు ఒక్కొక్క కోడిగుడ్డు రూ.ఐదు రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే పౌల్ట్ఫ్రిం వద్దనే ఎక్కువ ధరకు లభిస్తుందని, తాము ఏమి చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని వ్యాపారస్తులు అంటున్నారు. అసలే వేసవి కాలం..పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కోడిగుడ్డు ధర తగ్గాల్సి ఉన్నప్పటికి ఒక్కసారిగా ఐదు రూపాయలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు. షాద్‌నగర్ పౌల్ట్రీ ఫామ్‌ల నుంచి గుజరాత్, మహారాష్ట్ర, హైదరాబాద్ వంటి మహానగరాలకు ఎగుమతి అవుతున్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధిలో పదుల సంఖ్యలో ఉన్న పౌల్ట్రీ ఫారాలు చికెన్‌తో పాటు కోడిగుడ్ల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వేసవిలో చికెన్ వినియోగం కొంత తగ్గినా, గుడ్ల వినియోగం మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్లు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. వేసవి సెలవులు కావడంతో అంగన్‌వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లు మూసి ఉండటంతో కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో, అంగన్‌వాడీల్లో విద్యార్థులకు కోడిగుడ్లు అందించడానికి రోజుకు లక్షల సంఖ్యలో ప్రభుత్వం గుడ్లను కొనుగోలు చేసేది. గుడ్లను పౌల్ట్రీ వ్యాపారులు బహిరంగ మార్కెట్‌కు వాటిని తరలిస్తున్నారు. వాస్తవంగా ఫాం ధర గుడ్డుకు రూ.2.50 నుంచి రూ.2.75 మధ్యవర్తులు కొనుగోలు చేస్తున్నారు. తిరిగి వారు హోల్‌సేల్ వ్యాపారులకు రూ.2.80 నుంచి రూ.2.90 అమ్ముతున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు రిటేల్ వ్యాపారులకు ఒక గుడ్డు రూ.3.25 నుంచి రూ.3.50 వరకు విక్రయిస్తున్నారు. ఇక రిటైల్ వ్యాపారులు వినియోగదారుల వద్ద నుంచి ఒక గుడ్డు రూ.ఐదు వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఫాం వద్ద నుంచి వినియోగదారునికి చేరుకునే లోపు గుడ్డు ధర దాదాపు రెండింతలు పెరుగుతోందని చెప్పవచ్చు. పౌల్ట్రీ ఫామ్ రైతులు ముందుకు వచ్చి సిండికేట్‌గా మారిన వ్యాపారులకు గుడ్లు విక్రయించకుండా వినియోగదారులకు చేరే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.