బిజినెస్

ఎవరేమన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘ఆర్‌బిఐ తదుపరి గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌కు గొప్ప అవకాశం వచ్చింది. స్పష్టమైన అభిప్రాయాలున్న పటేల్.. తన నిర్ణయాలతో మంచి మార్పులకు నాంది పలుకుతారు’.
- ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్ర
‘ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం. పటేల్ ఎంపికతో అటు ఆర్‌బిఐ, ఇటు ప్రభుత్వంలో సంస్కరణాత్మక నిర్ణయాలు కొనసాగుతాయన్న సంకేతాలిచ్చినట్లైంది’.
- ఎస్‌బిఐ చైర్‌పర్సన్ భట్టాచార్య
‘ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్‌కు పటేల్ సరైన వారసుడు. కొత్త గవర్నర్ వృద్ధిని, ద్రవ్యోల్బణాన్ని సమన్వయం చేస్తాడని అనుకుంటున్నా’.
- ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి
‘రాజన్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన వాటన్నింటినీ కూడా పటేల్ పూర్తి చేయాలి. ఇకముందూ ఆర్‌బిఐ నిర్ణయాలు ప్రభావవంతంగా ఉండాలి’.
- ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్‌సి చక్రబర్తి
‘రఘురామ్ రాజన్ విధానాలను పటేల్ కొనసాగిస్తారని అనుకుంటున్నాం’.
- వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్
‘కరెన్సీ ఒడిదుడుకులు, బ్రెగ్జిట్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త గవర్నర్‌కు సవాల్ విసురుతున్నాయి’.
- బయోకాన్ సిఎండి కిరణ్ మజుందార్ షా
‘్భరత మార్కెట్లు మరింత స్వతంత్రంగా నడవడానికి పటేల్ నాయకత్వంలోని ఆర్‌బిఐ చర్యలు చేపట్టాలి’.
- మిహిర్ వోహ్రా (మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్)
‘ఉర్జిత్ పటేల్‌కు ఇది చక్కని అవకాశం. ఆయన హయాంలో ఆర్‌బిఐ కీర్తి మరింత ఇనుమడించాలి’.
- యెస్ బ్యాంక్ సిఇఒ రాణా కపూర్
‘ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిట్ పటేల్ ఎంపిక సరైనది’. - ఈనమ్ సెక్యూరిటీస్
‘గొప్ప నిర్ణయం. ఆర్‌బిఐ గవర్నర్‌గా పటేల్ సమర్థవంతగా పనిచేస్తారు’.
- మోహన్‌దాస్ పాయ్ (ఇన్ఫోసిస్)
‘పటేల్ నేతృత్వంలో ఆర్‌బిఐ నిర్ణయాలు మరింత పారదర్శకంగా, వేగంగా ఉంటాయని ఆశిస్తున్నాం’.
- సజ్జిద్ చినాయ్ (జెపి మోర్గాన్)
‘ద్రవ్యోల్బణం, ఆర్థిక ప్రగతిని సమన్వయపరుస్తూ ఉర్జిత్ పటేల్ ముందుకెళ్తారని భావిస్తున్నాం’.
- రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ సిఇఒ సునీల్ గోద్వాని