బిజినెస్

ఎయిర్‌టెల్ చీఫ్‌గా సునీల్ మిట్టల్ పునర్నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్‌గా సునీల్ భారతీ మిట్టల్ మరోసారి ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉండనుండగా, ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నూతన పదవీకాలం మొదలవుతుంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు భారతీ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. మిట్టల్.. భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడన్నది తెలిసిందే. టెలికామ్, బీమా, రియల్ ఎస్టేట్, వ్యవసాయ, ఆహార, ఇతరత్రా వెంచర్లలో భారతీ ఎంటర్‌ప్రైజెస్ దేశ, విదేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది.