బిజినెస్

నష్టాల్లో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. వాహన, ఆర్థిక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 118 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ సైతం 23 పాయింట్లు నష్టపోయి 12,000 మార్కు దిగువకు చేరింది. ఐతే వాణిజ్య వారం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెనె్సక్స్ 279.4 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 78.70 పాయింట్లు అదనంగా దక్కించుకుంది. కేంద్రంలో వరుసగా రెండోమారు కొలువుదీరిన మోదీ ప్రభుత్వం మంత్రులకు శాఖలకు కేటాయించడంతో మదుపర్లు దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ నెలకొన్న ఇతర పరిస్థితులపై దృష్టి నిలిపి ఆచితూచి అడుగేస్తున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 30 షేర్ల సెనె్సక్స్ సుమారు 750 పాయింట్ల నడుమ ఊగిసలాటకు గురై చివరిగా 117.77 పాయింట్లు కోల్పోయి 0.30 శాతం నష్టాలతో 39.714.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 39.373.24 పాయింట్ల కనిష్టానికి దిగివచ్చి, మరో దశలో 40,122.34 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 23.10 పాయింట్లు కోల్పోయి 0.19 శాతం నష్టంతో మొత్తం మీద 11,922.80 పాయింట్ల వద్ద స్థిరపడింతి. ఈ సూచీ సైతం ఒక దశలో 11,922.80 పాయింట్ల కనిష్టానికి, మరో దశలో 12,039.25 పాయింట్ల గరిష్టానికి చేరింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంకు అత్యధికంగా 4.27 శాతం నష్టపోయింది. అలాగే ఐటీసీ, వేదాంత, ఎం అండ్ ఎం సైతం 3.61 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఆసియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ సుమారు 2.43 శాతం అదనపు లాభాలను అందుకున్నాయి. కాగా దేశ స్థూల ఆర్థికాభివృద్ధి గణాంకాలపై మదుపర్లు ప్రత్యేక దృష్టి నిలిపి ఆచితూచి వ్యవహరించడం వల్లే దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని విశే్లషకులు చెబుతున్నారు. బీజేపీని వరసగా రెండోమారు విజయపథంలో నడపడంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మోదీ 2.0 కేబినెట్‌లో కొత్త హోం మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్ సైతం మరో కీలక రక్షణ శాఖకు మారారు. అనూహ్యంగా ఆర్థిక, సహకార మంత్రి పదవులు నిర్మలా సీతారామన్ పరమయ్యాయి. విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి ఎస్. జైశంకర్ సైతం ఏకంగా ఆ శాఖ మంత్రి అయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ అత్యంత క్లిష్టతరమైన బాధ్యత. ఈక్రమంలో జరుగుతున్న పరిణామలన్నింటినీ మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. కాగా విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం రూ. 1,664.74 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ. 1,122,60 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. ఈ నేపథ్యంలో మొత్తం వాణిజ్య వార పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ఇక ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలతో ముగియగా, ఐరోపా దేశాల మార్కెట్లు ఆరంభ వాణిజ్యంలో నష్టాలతోనే సాగాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం స్వల్పంగా పెరిగి రూ. 69.82 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2.62 శాతం తగ్గి బ్యారెల్ 63.62 డాలర్ల వంతున ట్రేడైంది.