బిజినెస్

ఇక భారత్‌లో సంస్కరణలకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా రెండోమారు అధికారాన్ని చేజిక్కించుకున్న మోదీ సర్కార్ పలు భారీ సంస్కరణలను చేపట్టే అవకాశాలున్నాయని, వాటి ప్రభావం వచ్చే 25 ఏళ్ల వరకు ఉంటుందని అమెరికాకు చెందిన ‘ఇండియా-సెంట్రిక్ బిజినెస్ అడ్వొకసీ అండ్ స్ట్రేటజిక్ గ్రూప్’ అధికారి ఒకరు పేర్కొన్నారు.
గత నెల 23న మోదీ సర్కార్‌కు దేశ ప్రజలు ఘన విజయాన్ని కట్టబెట్టడం ద్వారా ‘దేశ ఆర్థిక స్థితిని, తమ జీవితాలను మెరుగుపరచి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించి, స్థూలంగా జాతీయ అభివృద్ధికి దోహదం చేసే నాయకుడు తమకు అవసరమ’ని చాటారని ఆ అధికారి తెలిపారు. వీటన్నింటీ సుసాధ్యం చేయగల వ్యక్తిత్వం, సమర్థత నరేంద్ర మోదీలో ఉందని ‘అమెరికా-్భరత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం’ (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) విభాగం అధ్యక్షుడు, సీఈఓ ముఖేష్ అఘి ఆదివారం నాడిక్కడ పీటీఐతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ‘ప్రజల అంచనాలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీకి ఇచ్చిన మెజారిటీ దీన్ని తేటతెల్లం చేస్తోంది. అందువల్ల కేంద్రం రానున్న రోజుల్లో వచ్చే 25 ఏళ్ల దేశ ప్రగతికి తోడ్పడే కొన్ని పెద్ద సంస్కరణలకు తెరలేపే అవకాశాలున్నాయ’ని ఆయన పేర్కొన్నారు. గత నెల 30న ప్రధాని మోదీ మొత్తం 58 మందితో కూడిన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 25 మంది కేబినెట్ మంత్రులున్నారు. ప్రధాని మోదీ సహా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, పీయూష్ గోయెల్, ఎస్. జైశంకర్ మరో తొమ్మిది మంది ఇండిపెండెంట్ చార్జి గల మంత్రులు, మరో 24 మంది సహాయ మంత్రులు పదవీ బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా దేశ ఆర్థికాభివృద్ధికి చెందిన అనేక సంస్కరణలు వేగవంతంగా చేపట్టాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని ముఖేష్ అఘి అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి కార్మిక, భూ సంబంధమైన సంస్కరణలను చేపట్టడం ద్వారా విదేశీ కంపెనీలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. తయారీ రంగంలో ప్రగతి సాధించాలంటే కార్మిక పరమైన సంస్కరణలను చేపట్టక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే తయారీ రంగంలో ముందుకు వచ్చే కంపెనీలకు అందుకు అవసరమైన విశాలమైన భూకేటాయింపులు సైతం చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం భూ సంస్కరణలు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే దివాళా, బ్యాంకులను మోసం చేయడం వంటివి నివారించేందుకు సంబంధించిన ప్రత్యేక ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ)పై ప్రభుత్వం ఇప్పటికే బాగా పనిచేస్తున్నప్పటికీ ఈ విషయంలో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
అలాగే అమెరికా-భారత్ వాణిజ్య బంధం బలోపేతమై ప్రస్తుతం రెండంకెల స్థాయికి చేరిందని, ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం 142 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం కొనసాగుతోందని, వచ్చే 10 సంవత్సరాల్లో ఇది 500 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని అఘి పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా అమెరికన్ కంపెనీలు మన దేశంలో సుమారు 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇందువల్ల 3.2 బిలియన్ల ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి.
ఇది భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశాలున్నాయని, చైనాతో అమెరికాకు ఏర్పడిన విభేదాలు ఇందుకు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. అమెరికాకు చెందిన ముఖ్య వాణిజ్య భాగస్వామ్య దేశాలకు చెందిన అమెరికా కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్‌ను తొలగించడంపై అఘి వ్యాఖ్యానిస్తూ ప్పారు. ఖచ్చితంగా ఇది అమెరికా తప్పతమేనని అన్నారు. కరెన్సీకి సంబంధించిన అవకతవకలకు భారత్ పాల్పడదు కాబట్టి ఇది సర్వసాధారణమేనని అన్నారు. చైనాలా కాకపోయినా ఈ విషయంలో భారత్‌కంటూ కొన్ని ప్రత్యేకతలున్నాయని ఆయన చెప్పారు. గత మంగళవారం ట్రంప్ ప్రభుత్వం తన ప్రముఖ వాణిజ్య భాగస్వామ్య దేశాల ‘కరెన్సీ మానిటరింగ్ లిస్ట్’ నుంచి భారత్‌ను తొలగించడం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రస్తుతం భారత ప్రభుత్వం సంప్రదింపులు సాగిస్తోంది. భారత్‌తోబాటు స్విడ్జర్లాండ్ సైతం ఈ జాబితా నుంచి తొలగింపునకు గురైంది.