బిజినెస్

షియోమీ అమ్మకాలు 72 శాతానికి వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత్‌లో తమ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు గత రెండేళ్లలో 72 శాతానికి పెరిగాయని చైనా టెక్ దిగ్గజం షియోమీ సోమవారం ప్రకటించింది. రెండేళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ సంస్థ ప్రధానంగా ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని అమ్మకాలను సాగిస్తున్న విషయం తెలిసిందే. ‘2014 జూలైలో భారత్‌లో ప్రవేశించిన మేము అత్యంత నాణ్యమైన హ్యాండ్‌సెట్లతో స్మార్ట్ఫోన్ పరిశ్రమలో సంచలనం సృష్టించాం. భారత్‌లో మా అమ్మకాలు ఈ రెండేళ్లలో (2014 జూలై నుంచి 2016 జూలై వరకు) 72 శాతానికి పెరిగాయి’ అని షియోమీ ఇండియా అధిపతి మను జైన్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే భారత్‌లో మొత్తం ఎన్ని హ్యాండ్‌సెట్లను అమ్మారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. స్మార్ట్ఫోన్లతో పాటు ఈ సంస్థ భారత్‌లో టాబ్లెట్లు, పవర్ బ్యాంకులు, బ్లూటూత్ స్పీకర్లు తదితర యాక్సెసరీలను కూడా అమ్ముతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మార్చి నెలలో రెడ్‌మీ నోట్-3 స్మార్ట్ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన షియోమీ ఇండియా గత ఐదు నెలల్లో 1.75 మిలియన్ హ్యాండ్‌సెట్లను అమ్మిందని, భారత ఆన్‌లైన్ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఏ త్రైమాసికంలోనైనా అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ఫోన్ ఇదేనని మను జైన్ వివరించారు.

చిత్రం..అమ్మకాల్లో దుమ్ము రేపుతున్న రెడ్‌మీ నోట్-3 స్మార్ట్ ఫోన్