బిజినెస్

చోక్సీని ఆర్థిక నేరగాడుగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ‘విదేశాలకు పారిపోయిన మోసగాడ’ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ముంబయి హైకోర్టుకు తెలియజేశారు. చోక్సీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను రద్దు చేయాల్సిందిగా ఆ అధికారులు సమున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో అభ్యర్థించారు. చోక్సీని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని, అతన్ని, అతనికి మద్దతిస్తున్న వ్యక్తులను ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని జస్టిస్ ఐఏ మహంతీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌ను అధికారులు కోరారు. నిధులను మళ్లించడం, మనీల్యాండరింగ్‌కు పాల్పడడం వంటి కార్యకలాపాల ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకును చోక్సీ సుమారు రూ. 6,097 కోట్ల మేర మోసగించాడని, ఆయనకు విచారణకు హాజరు కావాలని ఎన్నిమార్లు సమన్లు పంపినా స్పందన లేదని, పైగా ఈడీకి సహకరించడం తనకు ఇష్టం లేదని చోక్సీ వ్యాఖ్యానించాడని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తమ దర్యాప్తును బహిష్కరిస్తున్నాడని అతనో విదేశాలకు పారిపోయిన మోసగాడని అధికారులు తెలిపారు. చట్టాలపై చోక్సీకి ఏమాత్రం గౌరవం లేదని అఫిడవిట్‌లో ఈడీ అధికారులు వ్యాఖ్యానించారు. క్రిమినల్ ప్రాసికూషన్ నుంచి తప్పించుకోవడం కోసమే అతను దేశం విడిచి పరారయ్యాడని తెలిపారు. ఇప్పటికే ఆంటిగువా పౌరసత్వాన్ని చోక్సీ స్వీకరించాడని, దీన్నిబట్టి అతనికి భారత్‌కు తిరిగివచ్చే ఉదేశం లేదని స్పష్టం చేశాడన్నారు.