బిజినెస్

భగ్గుమంటున్న పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జూన్ 4: ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. ఇదే సమయంలో వంటగ్యాస్ ధరలు సైతం పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. రోజువారీ ధరల నిర్ణయాన్ని పెట్రోల్ ఉత్పత్తి సంస్థలకే కేంద్ర ప్రభుత్వం అప్పగించిన నేపథ్యంలో ఎన్నికల తరువాత రోజూ ధరలు పెరుగుతున్నాయి. 2016 జూన్ వరకు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సమయంలో పెట్రోల్ లీటరు రూ.71.32, డీజిల్ రూ.61.05గా ఉండేది. అయితే ధరల నియంత్రణను రోజువారీ సమీక్ష ద్వారా చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలకు అధికారం అప్పగించిన నాటి నుండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. 2017 ఆగస్టు 1న పెట్రోల్ లీటరు రూ.71, డీజీల్ లీటరు రూ.62.24 నుండి మొదలుపెట్టి 2018 జూన్ 4 నాటికి పెట్రోల్ లీటరు రూ. 83.91, డీజీల్ లీటరు రూ. 75.98, మే 29 నాటికి గరిష్టంగా పెట్రోలు లీటరు రూ. 84.72, డీజిల్ లీటరు రూ. 76.63 ధరకు చేరాయి. 2014లో మోదీ ప్రధాని అయ్యే సమయానికి పెట్రోల్ లీటరు రూ. 78.02 కాగా, డీజీల్ లీటరు రూ. 58.91 ధర ఉండేది. ఒకదశలో పెట్రోల్, డీజీల్ ధరలు వంద రూపాయల మార్కును దాటుతాయని అనుకుంటున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ధరల పెరుగుదల నిలిచిపోయింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరుగుదలకు అనుగుణంగా ఇక్కడ ధరలు పెరుగుతున్నాయని చెబుతున్న చమురు ఉత్పత్తి సంస్థలు, అక్కడ తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ తగ్గించడం లేదు. 2008లో గరిష్టంగా క్రూడాయిల్ ధర బ్యారెల్ 147 డాలర్లు ఉన్న సమయంలో కూడా పెట్రోలు ధర లీటరు రూ. 54గా మాత్రమే ఉండేది. కాని ఇప్పుడు బ్యారెల్ ధర తగ్గినా ఇక్కడ రూ. 80 పైనే ఉంటోంది. జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న బంకుల ద్వారా ప్రతీరోజు లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుంది. ఎన్నికలకు ముందు కాస్త దిగివచ్చిన పెట్రో ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 230 బంకుల ద్వారా ప్రతీరోజు సుమారు 6వేల లీటర్ల డీజిల్, 3వేల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతుంది. ముఖ్యంగా హైవే, నగర, పట్టణ ప్రాంతాల్లోనే వీటి వినియోగం అధికంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 90వేల లీటర్ల పెట్రోలు, సుమారుగా 2లక్షల లీటర్ల డీజిల్ వినియోగం ప్రతీనెల జరుగుతోంది. పెరుగుతున్న ధరలు వాహనదారులపై పెనుభారానే్న మోపుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన ధర కారణంగా ప్రతీరోజు సుమారు 20లక్షల రూపాయల అదనపు భారం వాహనదారులపై పడుతోంది. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు కొంత నియంత్రణలో ఉంటాయనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తవౌతోంది. తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పెట్రో ధరలు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జిల్లా పెట్రోల్ బంకు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ నరసింహరావు తెలిపారు. రోజువారీ ధరల సవరణతో తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ నష్టాలను చవిచూడాల్సి వస్తోందన్నారు. పెట్రో ధరల పెరుగుదల భారం ఆటోడ్రైవర్లు, రైతుల కుటుంబాలనూ కుంగదీస్తోంది. ఆమేరకు తాము చార్జీ పెంచుదామంటే సర్వీసులు నడవటం లేదని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు.