బిజినెస్

ఓఎన్‌జీసీ లక్ష్య సాధన కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: భారత్‌కు చెందిన ప్రముఖ చమురు, సహజవాయుల ఉత్పత్తి సంస్థ (ఓఎన్‌జీసీ) రానున్న కొనే్నళ్లలో ఉత్పత్తిని, లాభాలను గణనీయంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా పరిస్థితులు అందుకు అనుకూలించేలా లేవని అంతర్జాతీయ సంస్థ ‘మూడీ’ అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న జాతీయ చమురు కంపెనీలన్నీ తమ వాణిజ్య వ్యూహాలను పునః సమీక్షించుకుంటున్నాయని, ఇందుకు కారణం వాతావరణ మార్పులతోబాటు చేయాల్సిన అత్యవసర మార్పులు, విద్యుత్ ఉత్పాదక మార్పులే కారణమని ఆ అధ్యయనం పేర్కొంది. భారత్ విద్యుత్ ఉత్పాదక వ్యూహం మేరకు 2020 నాటికి హైడ్రోకార్పన్ దిగుమతులను 10 శాతం తగ్గించుకోనుందని ఆ నివేదిక తెలిపింది. ప్రధానంగా దేశీయంగా హైడ్రోకార్బన్ ఉత్పత్తులు చేసుకోవడం, బయో ఇంధన వినియోగం, పునరుత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు వంటి అంశాలకు భారత్ ప్రాధాన్యతనిస్తుందని తెలిపింది. రిఫైనరీ ప్రక్రియను పెంచడం, ముడిచమురు డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లు పెంచడం వంటివి కూడా చోటుచేసుకుంటాయని తెలిపింది. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సాధించాలన్న లక్ష్యంతో భారత్ ముందుకెళుతోంది. ఇందువల్ల 2030 నాటికి విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ రహిత ఇంధన వినియోగాన్ని 40 శాతం తగ్గించాలని దేశం భావిస్తోంది. భారత్‌కు జరుగుతున్న చమురు దిగుమతులను తగ్గించుకోవాలన్న కేంద్ర లక్ష్యం మేరకు దేశంలోని అతిపెద్ద చమురు సంస్థలు ఓఎన్‌జీసీ, ఎన్‌ఓసీ ఇటీవల సమ్మిళితమయ్యాయి. ఇందువల్ల దేశానికి అవసరమైన 80 శాతం చమురును, 40 శాతం సహజవాయువును ఈ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రభుత్వం సైతం హైడ్రోకార్బన్ వినియోగాన్ని తగ్గించే క్రమంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక రాయితీలు సైతం ఇస్తోందని మూడీస్ నివేదిక తెలిపింది. కనీసం 20 శాతం బయోడీజిల్, 5 శాతం ఇథనాల్ వినియోగించాలన్న నిబంధన సైతం 2030 నాటికి అమలులోకి రానుంది. ప్రసుత్తం గ్రామాల్లో 44 శాతం ఓఎన్‌జీసీ సహజవాయువుల వినియోగం జరుగుతున్నప్పటికీ మొత్తం విక్రయాల్లో ఇది కేవలం 17 శాతం మాత్రమే. తూర్పు కోస్తాలో ఈ కంపెనీ ఉత్పత్తులను రాబోయే కొనే్నళ్లలో విస్తరించేందుకు ప్రణాళికలు వేసింది.
ఐతే సహజవాయువులకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సక్రమంగా లేదని నివేదిక తెలిపింది. మిలియన్ బ్రిటిష్ ధర్మల్ యూనిట్లకు ప్రభుత్వం ఇస్తున్న అత్యధిక ధర 3.69 డాలర్లు. ఐతే అనేక విభాగాల్లో జరుగుతున్న ఉత్పత్తులకు అవుతున్న ఖర్చుతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువ.