బిజినెస్

లాభాల స్వీకరణతో డీలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారాయి. సెనె్సక్స్ 184.08 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 66.90 పాయింట్లు నష్టపోయింది. సెనె్సక్స్ ప్యాక్‌లో హీరోమోటోకార్ప్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ అత్యధికంగా 3.08 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఎస్ బ్యాంకు, ఎన్‌టీపీసీ, ఆక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 2.71 శాతం లాభపడ్డాయి. కాగా బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 0.46 శాతం నష్టపోయి 40,083.54 పాయింట్ల దిగువకు చేరుకోగా, బ్రాడర్ ఎన్‌ఎస్‌సీలో నిఫ్టీ 0.55 శాతం నష్టపోయి 12,021.65 పాయింట్లకు దిగివచ్చింది. వాహన, ఐటీ కౌంటర్లలో భారీగా వాటాల అమ్మకాలు జరిగాయి. ఈ రెండు కౌంటర్లలో సోమవారం అత్యధిక లాభాలు సమకూరిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ రెపోరేట్ల కోత విధిస్తుందన్న అంచనాలతో మదుపర్లు పెద్దమొత్తాల్లో వాటాలు కొనుగోలు చేయగా రెండు సూచీలూ జీవితకాల గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. దీంతో పై స్థాయిలో మంగళవారం వాటాల విక్రయం జరిగింది. దేశంలో రుతుపవనాల ముందస్తు నివేదికలు తీవ్ర ఆందోళనకరంగా ఉంటడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసిందని కూడా మరో అంచనా. గత 65 ఏళ్లలోనే రెండవ అతి తక్కువ వర్షపాతం నమోదైందన్నది ఆ గణాంకాల సారాంశం. గడచిన మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో వర్షపాతం 25 శాతం తక్కువగా నమోదైంది. మార్చి నెలతో ముగిసిన త్రైమాసికానికి జీడీపీ గణాంకాలు బలహీనంగా ఉండటంతోబాటు, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలతో మంగళవారం ఉదయం మార్కెట్లు స్వల్ప నష్టాలతోనే ఆరంభమయ్యాయి.
స్వల్పంగా తగ్గిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ మంగళవారం స్వల్పంగా తగ్గి మొత్తం రూ.69.28గా ట్రేడైంది. కాగా ఆసియా దేశాల మార్కెట్లు నష్టాల్లో సాగాయి. ఇక ఐరోపా దేశాల మార్కెట్లు ఆరంభ సెషన్లో లాభాలు నమోదు చేశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.53 శాతం తగ్గి బ్యారెల్ 60.34 డాలర్ల వంతున ట్రేడైంది.