బిజినెస్

మరింత సామర్ధ్యంతో సరికొత్త ‘క్విడ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఫ్రెంచి ఆటో దిగ్గజం రెనాల్ట్ సరికొత్త వెర్షన్‌లో తన చిన్న కారు ‘క్విడ్’ను సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. మారుతీ సుజుకీ సంస్థకు చెందిన ఆల్టో కె-10 మోడల్‌కు పోటీగా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందించిన ఈ కారు గరిష్ఠ ధరను (్ఢల్లీ ఎక్స్-షోరూమ్ ధరను) రూ.3.95 లక్షలుగా నిర్ణయించారు. రెనాల్ట్ సంస్థ ఇప్పటికే 800 సిసి (0.8 లీటర్ల) సామర్ధ్యం కలిగిన క్విడ్ కారును రూ.2.64 లక్షల నుంచి రూ.3.73 లక్షల ధరకు అమ్ముతున్న విషయం విదితమే. దీని సామర్ధ్యాన్ని 1.0 లీటర్లకు పెంచి రెనాల్ట్ ఇప్పుడు రెండు కొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో మొదటి వేరియంట్ ధరను రూ.3.82 లక్షలుగానూ, రెండో వేరియంట్ ధరను రూ.3.95 లక్షలుగానూ నిర్ణయించింది. కనుక వీటిలో 1000 సిసి సామర్ధ్యం కలిగిన టాప్ మోడల్ ‘క్విడ్’ను సొంతం చేసుకోవాలనుకునే కొనుగోలుదారులు పాత మోడల్ ధర కంటే అదనంగా మరో రూ.22 వేలు వెచ్చించాల్సి ఉంటుంది.

చిత్రం..న్యూఢిల్లీలో సోమవారం ‘క్విడ్ 1.0 వెర్షన్ కారును
ఆవిష్కరిస్తున్న రెనాల్ట్ ఇండియా సిఇఓ, ఎండి సుమిత్ సాహ్నీ