బిజినెస్

భారత్ వృద్ధి రేటు 7.5 శాతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 5: భారత్‌లో వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 7.5 శాతంగా ఉండబోతోందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.2గా నమోదైనట్టు తన తాజా నివేదికలో ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ప్రభుత్వపరంగా నిధుల వినియోగం కొంత తగ్గినప్పటికీ పెట్టుబడులు విస్తారంగా రావడం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2018లో 6.6 శాతంగా ఉన్న వృద్ధి రేటు క్రమంగా పెరగడానికి పెట్టుబడుల వెల్లువే కారణమని పేర్కొంది. 2019లో చైనా వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని స్పష్టం చేసిన ప్రపంచ బ్యాంకు 2020లో ఇది 6 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. భారత్‌లో మాత్రం వృద్ధి రేటు స్థిరంగా కొనసాగే అవకాశం కనిపిస్తోందని ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలోని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు చైనా కంటే చాలా వెనుకబడిన భారత్ అనతికాలంలోనే పుంజుకున్నట్టు సీఎస్‌ఓ పేర్కొంది. పెట్టుబడి, ఉత్పత్తి, వినియోగం అనే మూడు ప్రధాన రంగాలు ఇటీవల కాలంలో శరవేగంగా విస్తరిస్తూ భారత్‌ను ప్రపంచ మేటి దేశాల సరసన నిలబెడుతున్నాయని సీఎస్‌ఓ నివేదిక వ్యాఖ్యానించింది. భారత రిజర్వు బ్యాంకు నిర్ణయించిన లక్ష్యాలు, అనుసరిస్తున్న విధానాలు దేశ వృద్ధి రేటు పెరగడానికి ప్రధాన కారణాలని తెలిపింది. కాగా, జూలై 5న నరేంద్ర మోదీ సర్కారు సమర్పించబోయే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నివేదికను ప్రధానంగా పేర్కొనే అవకాశాలు ఉన్నాయి.