బిజినెస్

మళ్లీ లాభాల్లోకి వస్తాం: అలహాబాద్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: గత ఏడాది రూ.8,334 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన అలహాబాద్ బ్యాంక్ ఈ ఏడాది వాటినుంచి చాలా వరకు బయటపడే అవకాశాలున్నాయి. ప్రధానంగా రుణాల రికవరీకి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంతోబాటు, ఇదివరకు ఉన్న లోటుపాట్లను సవరించుకునేందు విశేష కృషి చేస్తున్నట్టు ఆ బ్యాంకు వార్షిక నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మాత్రం ఈ బ్యాంకుకు నిరాశా జనకంగా ఉంటుందని అంచనా. కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడిచే ఈ బ్యాంకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ. 4,674 కోట్ల నష్టాన్ని, అంతకు ముందు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.279 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. దీంతో రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి కనీసం త్రైమాసికానికి రెండు వేల కోట్ల రూపాయల బకారుూలను వసూలు చేయాలని సంకల్పించింది. 2020 నాటికి బ్యాంకు పూర్తిగా నష్టాల ఊబినుంచి బయటకు వస్తుందని, తర్వాత ప్రతిఏటా లాభాలను సంతరించుకోవాలనే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, వడ్డీల మార్జిన్ 2.65 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నామని మొత్తం ఆదాయంలో ఈ మొత్తమే లాభంగా పరిగణించబడుతుందని ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్‌ఎస్ మల్లికార్జున రావు బుధవారం నాడిక్కడ జరిగిన వాటాదారుల సమావేశంలో పేర్కొన్నారు. పద్దు నష్టాల కారణంగా గత జనవరిలో ఈ బ్యాంకు రిజర్వు బ్యాంకు ‘వాచ్ లిస్టు’ లోని ‘ప్రాంప్ట్ కరెక్టివ్ ఆక్షన్ ప్లాన్’ (పీసీఏ) ఫ్రేం వర్క్ పరిధిలోకి వచ్చింది. ఆ తర్వాత మూల ధనం సమకూర్పు కింద కేంద్ర ప్రభుత్వం రూ. 11,740 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరంలో మూడు ట్రాంచైజీల ద్వారా మంజూరు చేసింది. ఆక్రమంలోనే గత ఫిబ్రవరిలో ఈ బ్యాంకుపై ఉన్న ఆంక్షలను సైతం ఆర్బీఐ తొలగించింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు అంతర్గతంగా పలు సంస్కరణలకు, మరిన్ని సరళీకృత విధానాలకు, విధినిర్వహణ సామర్ధ్యాలకు అనుగుణంగా ఈ బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా లోపాలను ప్రతి త్రైమాసికంలో క్రమంగా తగ్గించాలని నిర్ణయించారు. మొండి రుణ వసూళ్లపై మరింత కఠిన వైఖరితో, ప్రణాళికాబద్ధంగా సాగాలని ప్రత్యేక (ఎస్‌ఏఎంవై) విధానాన్ని రూపొందించారు. నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ)పై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్టు, అ ఖాతాలను నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.
కాగా నిధుల సమీకరణ ప్రణాళికల విషయానికొస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది గణనీయంగా సాగుతుందని, రూ. 4,000 కోట్ల నిధులను వివిధ రూపాల్లో సమకూర్చుకునేందుకు ఇప్పటికే బోర్డు ఆమోదం లభించిందని తెలిపారు. 2019 మార్చి నాటికి ఈ బ్యాంకు నిరర్థక ఆస్తుల సగటు 17.55శాతంగా ఉంది. ఈ బ్యాంకు అధికారులు నిర్ధిష్ట ప్రణాళిలతో ఇప్పటి వరకు మొత్తం రూ. 4,288.83 కోట్ల రుణాలను వసూలు చేశారు. ఇందులో రూ. 2,826.71 కోట్లు నగదు రూపంలో జరిగింది. గతంతో పోలిస్తే ఇది 36.43 శాతం అధికం.