బిజినెస్

నెఫ్ట్, ఆర్టీజీఎస్ చార్జీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: దేశంలో డిజిటల్ లావాదేవీలను మరింత విస్తృతం చేసే దిశగా ఆర్బీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా లావాదేవీలు నిర్వహించే వారికి ఊరట కలిగించింది. నగదు బదిలీలపై ఇప్పటివరకు బ్యాంకులు వసూలు చేస్తున్న చార్జీలను రద్దుచేసింది. తక్షణమే ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని బ్యాంకులను ఆదేశించింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా జరిగే నగదు బదిలీలపై ఇకనుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే ఏటీఎంలద్వారా జరిగే విత్‌డ్రాల్స్‌పై వసూలు చేస్తున్న చార్జీలపై కూడా సమీక్ష జరిపేందుకు ఒక ప్యానల్‌ను నియమిస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆర్బీఐ గురువారం నిర్వహించిన ద్రవ్యవిధాన సమీక్షలో ఈ మేరకు తాజా నిర్ణయాలను ప్రకటించింది. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఈ తరహాలో లావాదేవీలు విస్తృతంగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆర్టీజీఎస్ ద్వారా భారీ మొత్తాలను తక్షణమే బదిలీ చేసేందుకు వీలుంటుంది. అలాగే నెఫ్ట్ ద్వారా రెండు లక్షల వరకు మాత్రమే నగదు బదిలీకి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ నెఫ్ట్ లావాదేవీలకు గాను రూపాయినుంచి ఐదు రూపాయలు అలాగే ఆర్టీజీఎస్ ద్వారా జరిగే లావాదేవీలపై ఐదునుంచి యాభై రూపాయలు వసూలు చేస్తోంది. ఇతరత్రా నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా జరిగే నగదు బదలాయింపులకు సంబంధించి బ్యాంకులపై కనీస చార్జీలను మాత్రమే వసూలు చేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ తమనుంచి వసూలుచేసే చార్జీలను రాబట్టుకోవడానికి బ్యాంకులు తమవంతుగా వినియోగదారులపై చార్జీలు విధిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు లావాదేవీలను కనిష్ఠ స్థాయికి తీసుకువచ్చే క్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం నగదుపై ఎక్కువ ఆధారపడకుండా డిజిటల్ మార్గాల ద్వారానే లావాదేవీలను నిర్వహించేందుకు అనేక మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ అన్నవి ఈ డిజిటల్ లావాదేవీలకు అనేక కోణాల్లో ఊతాన్నిచ్చాయి. ఇప్పుడు ఈ రకమైన లావాదేవీలపై విధిస్తున్న చార్జీలను కూడా రద్దుచేయడం ద్వారా మరింతగా డిజిటల్ వ్యవహారాలకు ఆర్బీఐ మరింత ఊతాన్ని ఇచ్చినట్లయింది.