బిజినెస్

ఊగిసలాటకు గురై చివరికి లాభాల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: భవిష్యత్తులో ద్రవ్య లభ్యతపై ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయన్న అంచనాలు వెలువడుతున్నప్పటికీ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు గణనీయంగా పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ బాగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో 400 పాయింట్లు ఎగబాకిన సెనె్సక్స్ చివరికి 86.18 పాయింట్లు ఆధిక్యతతో 39,615.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 26.90 పాయింట్ల ఆధిక్యంతో 11,870.65 పాయింట్లకు చేరింది. కాగా మొత్తం వాణిజ్య వారంలో సెనె్సక్స్ 98.30 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 52.15 పాయింట్లు కో ల్పోయింది. ఇలావుండగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెనె్సక్స్ ప్యాక్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంత 1.90 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఎస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్‌పార్మా, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్ 2.37 శాతం నష్టాల పాలయ్యాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు ప్రస్తుతం నిధులకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో మదుపర్లు కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో పెట్టుబడులకు శుక్రవారం ఆసక్తిని కనపరిచారు. ఐతే బలహీన పడిన రూపాయి మారకం విలువ ఐటీ స్టాక్‌లపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ ఆర్థిక స్థితి మందగమనాన్ని సరిచేసే దిశలో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం రేట్లకోతకు ఉపక్రమిస్తున్నాయి. ఆసియా, ఐరోపా దేశాల్లో ఈ ప్రయోగం మార్కెట్లకు ఊతమిస్తుండడమే ఇందుకు కారణం. ఈ నేపధ్యంలోనే శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సానుకూలత నెలకొన్నప్పటికీ సూచీల పరుగుకు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం బ్రేక్‌వేయడంతో స్వల్పలాభాలే నమోదయ్యాయి. రానున్న కేంద్ర బడ్జెట్, అమెరికా ఉద్యోగ జాబితా తదితర అంశాలు రాబోయే రోజుల్లో మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రంగాల వారీగా చూ స్తే బీఎస్‌ఈలో టెలికాం, ఫైనాన్స్, వినిమయ వస్తువులు, బ్యాంకెక్స్, సాంకేతిక సూచీలు శుక్రవారం 0.79 శాతం లాభపడగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మా ల్‌క్యాప్‌లోని విద్యుత్, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి, లోహ సూచీలు 1.29 శాతం నష్టపోయాయి. ఆలావుండగా విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు రూ. 1,448.99 కోట్ల విలువైన వాటాలను గురువారం విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు రూ. 650.84 కోట్ల విలువైన వాటాలను విక్రయించారని స్టాక్ మార్కెట్ ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది .
బలహీనపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం 20 పైసలు తగ్గి మొ త్తం రూ.69.48గా ట్రేడైంది. కాగా అంతర్జాతీయం గా సెంట్రల్ బ్యాంకులు రేట్ల కోతకు ఉపక్రమించడం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావాన్ని చూపింది. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్య వత్తిడులు వెరసి శుక్రవారం ఆసియా ఖండంలోని చైనా, జపాన్, కొరియా మార్కెట్ సూచీలు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. అలాగే ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. ముడి చమురు ధరలు 1.20 శాతం పెరిగి బ్యారెల్ 62.41 డాలర్లు పలికింది.