బిజినెస్

స్వల్పంగా కోలుకున్న సెనె్సక్స్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 19: విదేశీ మదుపరులు ఆసక్తి ప్రదర్శించినప్పటికీ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్ స్వల్పంగా పెరిగింది. మెజారిటీ లావాదేవీలు ప్రారంభమైన వెంటనే మార్కెట్ సూచీలు వేగంగా పెరిగాయి. ఒకానొక దశలో సెనె్సక్స్ 400 పాయింట్ల కంటే పైగా నమోదయ్యాయి. అయితే, మధ్యాహ్నం తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టిన సూచీ చివరకు 66.40 పాయింట్ల లాభంతో ముగిసింది. 0.17 శాతం మేరకు పెరిగిన సెనె్సక్స్ 39,112.74 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా స్టీల్, కొటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు సుమారుగా 4.60 శాతం మేరకు లాభపడ్డాయి. అయితే, ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో కంపెనీల షేర్ల ధర సగటున 5.54 శాతం పతనమయ్యాయి. ఆసియా మార్కెట్‌లో సానుకూల ధోరణులు కనిపించడంతో భారత స్టాక్ మార్కెట్‌లు ప్రారంభంలో మెరుగైన ఫలితాలను రాబట్టింది. అయితే, క్రమంగా విదేశీ మదుపరులు అమ్మకాలపై ఆసక్తి చూపడంతో సెనె్సక్స్ పతనం మొదలైంది. చివరివరకు అదే పరిస్థితి నెలకొనడంతో సెనె్సక్స్ ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జించలేక స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 11,691.45 పాయింట్ల వద్ద ముగిసింది. వివిధ రకాల పరంగా చూస్తే హెల్త్‌కేర్, ఆటో, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ తదితర రంగాలు నష్టపోయాయి. మధ్యతరహా కంపెనీలు మాత్రం లాభాల బాటలో నడిచాయి.