బిజినెస్

ఆసియా మార్కెట్లలో నూతనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్-కాంగ్, జూన్ 19: వాణిజ్య ఒప్పందాలకు అమెరికా-చైనా దేశాలు మళ్లీ చేతులు కలపబోతుండడంతో ఆసియా మార్కెట్లలో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ బుధవారం చైనా అధ్యక్షుడు జీజిపింగ్‌కు ఫోన్ చేయడంతో శుభపరిణామంగా ఆసియా మార్కెటర్లు సంతోషిస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెర పడి, సుహృద్భావమైన వాతావరణంలో పునరుద్ధరణకు అవకాశం ఏర్పడబోతున్నది. చైనా అధ్యక్షుడు జీజిపింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ ప్రశంసించిన వార్తలు దావానంలా వ్యాపించాయి. దీంతో అసియా మార్కెట్లలో కొత్త ఉత్సాహం వెల్లువెత్తింది.
బుధవారం ట్రంప్, జీజిపింగ్‌తో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. వచ్చే వారం జరగనున్న ‘జీ-20’ సమావేశాల్లో కలుద్దామంటూ ట్రంప్ ఆయన్ను ఆహ్వానించడంతో ఇంత వరకు అమెరికా-చైనాల మధ్య బాధాకరంగా ఉన్న వాణిజ్య యుద్ధానికి తెర పడి, సుహృద్భావమైన వాతావరణంలో వాణిజ్య ఒప్పందాల పునరుద్ధరణ జరుగుతుందన్న చర్చ ఆరంభమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం పుంతలు తొక్కింది. గత నెలలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా మార్కెట్‌లో అస్థిరత పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో వాణిజ్య, వర్తక వ్యాపారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధిక సంఖ్యలో ఆసియా మార్కెటర్లు కనీసం ఒక్క శాతం ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. విదేశీ మార్కెటర్లే కాకుండా మన దేశంలోని ముంబయి మార్కెటర్లు కూడా ట్రంప్-జీజిపింగ్ ఫోన్ చర్చల పట్ల సంతోషాన్ని తెలిపారు. వచ్చే వారం జపాన్‌లో జి-20 సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కలుద్దాం అంటూ ట్రంప్ చైనా అధ్యక్షుడు జీజిపింగ్‌ను ఆహ్వానించడం శుభపరిణామమని మార్కెటర్లు భావిస్తున్నారు. ఇరు దేశాలకూ ఇది మేలు కలిగిస్తుందని చైనా ప్రతినిధి వ్యాఖ్యానించగా, మొత్తం ఆసియా మార్కెట్లకే ప్రయోజనం ఉంటుందని మార్కెటర్లు అభిప్రాయపడుతున్నారు. చైనా దిగి రాకపోతే తాము చైనా దిగుమతులన్నింటిపై భారీగా టారిఫ్‌ను పెంచుతామని ట్రంప్ లోగడ హెచ్చరించిన సంగతి తెలిసిందే.