బిజినెస్

బొగ్గు ఉత్పత్తికి అధికారుల పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: దేశ అవసరాల కోసం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తులను భారీగా పెంచాలని సింగరేణి అధికారులు పరుగుతీస్తున్నారు. రానున్న వర్షాకాలంలో బొగ్గు తవ్వకాలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టారు. బొగ్గు నిల్వలు పెంచడానికి సింగరేణి అధికారులు యద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. బొగ్గు సరఫరా కోసం వచ్చిన టెండర్లదారులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఉండేందుకు సింగరేణి ముందస్తుగా జాగ్రతలు తీసుకుంటోంది. గత ఏడాదితో పోల్చిచూస్తే బొగ్గు ఉత్పత్తి నల్లేరుపై నడకలాగా ఉందని సింగరేణి అధికారులు గుర్తు చేస్తున్నారు. గడచిన ఏప్రిల్, మే నెలల్లో బొగ్గు ఉత్పత్తులు తగ్గాయి. ప్రస్తుతం జూన్ నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధికమించడానికి ప్రత్యేక శ్రద్ధచూపిస్తున్నారు. వచ్చే వర్షాకాలంలో గ్రౌండ్‌స్టాక్‌ను మరింత పెంచుకోవడానికి ఏర్పాట్లు చరుకుగా సాగుతున్నాయి. ఆర్‌జీఒసీ-3 ఖైరిగూడ ఒసీ, ఇతర ఓసీలలో బొగ్గు ఉత్పత్తి పెంచాలని, భూగర్బ గనుల్లో కెటీకె-8, వీకే-7, ఆర్‌కే-8 జీడీకే-1,2, శాంతి ఖని, శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో ఉత్పత్తిని మరింత పెంచడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. కొత్త గనుల తవ్వకాల కోసం భూసేకణ మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సింగరేణి సీఎండీ వౌకిక ఆదేశాలు జారీ చేశారు.
ఇందారం ఓపెన్ కాస్టు, కేటీకే ఓపెన్ కాస్టు-3 కోయగూడెం-3 జీడీకే -5 ఓపెన్ కాస్టు గనుల్లో సత్వరమే పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు పరుగులు తీస్తున్నారు. కొత్త గనుల కోసం స్థల సేకరణ సకాలంలో పూర్తి చేయడానికి ఇటు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌ను సింగరేణి అధికారులు సంప్రదిస్తున్నారు. ప్రతియేటా సింగరేణిలో మొక్కలు పెంచే కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమంలో సింగరేణి ఏరియాలో భారీగా ఉద్యోగ, కార్మికులు పాల్గొనే విధంగా కార్యక్రమాలు చేపట్టారు.