బిజినెస్

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 21: గత మూడు రోజులుగా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్ శుక్రవారంనాడు ఒక్కసారిగా వెనుకంజ వేసింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో దాని ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌గా మిశ్రమ ఫలితాలను చవిచూసింది. బీఎస్‌ఈ సెనె్సక్ శుక్రవారం 407 పాయింట్లు దిగజారింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 407.14 పాయింట్లు దిగజారి 39,194.49 పాయింట్ల వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 107.65 పాయింట్లు నష్టపోయి 11,724.10 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈవారం సెనె్సక్స్ మొత్తం 257.58 పాయింట్లు దిగజారగా, నిఫ్టీ 99.2 పాయింట్లు నష్టపోయింది. ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు తమ మిలటరీ దళాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాని ప్రభావం చమురు ధరలు ఒక్కసారిగా ఎకబాకాయి. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో రూపాయి మారకం విలువ కూడా బలహీనపడింది. దీని ప్రభావంతో మార్కెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. సెనె్సక్స్‌లో ఎస్ బ్యాంక్ శుక్రవారంనాడు భారీగా నష్టపోయింది. ఈ బ్యాంక్ 4.36 శాతం నష్టాన్ని చవిచూసింది. దీనితర్వాత మారుతి, హెడీఎఫ్‌సీ, హీరో మోటోకార్ప్, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, కొటక్ బ్యాంక్, కోల్ ఇండియా, ఆర్‌ఐఎల్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 3.39 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, వేదాంత, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1.28 శాతం మేరకు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఆటో, ఎనర్జీ, టెలికాం, ఎఫ్‌ఎంజీ, హెల్త్‌కేర్, టెక్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ వంటి రంగాల్లో సూచీలు 1.32 శాతం వరకు తగ్గాయి. అదే సమయంలో పవర్, బేసిక్ మెటీరియల్ సూచీలు 0.10 శాతం వద్ద లాభపడ్డాయి.