బిజినెస్

అంకుర సంస్థలకు ‘సోషియల్ అల్ఫా’ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: బిరాక్, ఎంఫసిస్‌లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని 10 అంకుర సంస్థల నిర్వహణను చేపట్టనున్నట్టు ‘సోషియల్ అల్ఫా’ గురువారం నాడిక్కడ తెలిపింది. వివిధ రకాల నైపుణ్యం కలిగిన వ్యక్తులతో సాంకేతిక పరమైన సమస్యలపై పరస్పర సహకారం కొనసాగించడంతోబాటు వారికి ఒక్కొక్కరికి రూ. 20 లక్షల వంతున ఆర్థిక సహకారాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ‘ప్రయోగ శాల నుంచి మార్కెట్‌కు’ అనే దృక్పథంతో ఎంపిక చేసిన కొన్ని అంకుర సంస్థలతో సాంకేతిక సహకారంతో ముందుకెళ్లాలని భావిస్తున్నామని సోషియల్ అల్ఫా సహ వ్యవస్థాపకుడు, సీఈవో, టాటాట్రస్ట్ పరిశోధనా, ఔత్సాహికుల విభాగం అధిపతి మనోజ్‌కుమార్ ఇక్కడ తెలిపారు. ప్రధానంగా ఆప్టిమల్ ప్రాడక్టు డిజైన్, మార్కెట్ అవకాశాలు, వినియోగదారుల పరమైన సహకారం ప్రతి అంకుర సంస్థకు ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. ఎంపికైన అంకుర సంస్థ మూడు నెలల పాటు వేగవంతమైన శిక్షణ (ఆక్సిలరేట్ ప్రోగ్రాం) ఉంటుందని, ప్రధానంగా మార్కెట్ అవకాశాలు, పెట్టుబడుల సంసిద్ధతలపై ఈ కార్యక్రమం నిర్వహించడం జరగుతుందన్నారు. కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖ మద్ధతుతో టాటాట్రస్ట్ నిర్వహణలో ఈ సోషియల్ అల్ఫా నడుస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో నాలుగు అంకుర సంస్థలను నిర్వహిస్తోంది. ఇందులో బయోనిక్ యంత్ర, బ్లీ టెక్నాలజీస్, ఇన్నావ్‌మేషన్, టాక్టోపస్ ఉన్నాయి. కాగా రూ. 5 కోట్ల కార్పస్ ఫండ్‌ను అంకుర సంస్థ ల్లో పెట్టుబడులుగా మదుపు చేయాలని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా మనోజ్‌కుమార్ తెలిపారు. పరస్పర సాంకేతిక సహకారానికి సంబంధించి భాగస్వాముల నుంచి సైతం ఇంతే మొత్తం పెట్టుబడులను ఆశిస్తున్నామన్నారు. నైపుణ్యం లేని వ్యక్తులకు అందుబాటు ధరల్లో నాణ్యతతో కూడిన పరిష్కార మార్గాలు అందజేసే విషయంలో ప్రస్తుతం చాలా కొరత ఉందని ఆయన అన్నారు. దేశంలో అక్షరాస్యతా లోపం వల్ల సుమారు 4 నుంచి 8 కోట్ల మంది తగిన అవకాశాలు లేక, అసమర్థులుగా మిగిలిపోతున్నారని, వీరికి సహకరిస్తే అద్భుత ప్రగతి సాధిస్తారన్న నమ్మకం ఉందని ఎంఫసిస్ ఉపాధ్యక్షుడు, కార్పొరేట్ సోసియల్ రెస్పాన్సిబులిటీ విభాగం అధిపతి మీను భంభనీ పేర్కొన్నారు.