బిజినెస్

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగిసిపోయిన తరుణంలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. తొలుత 300 పాయింట్ల వరకు ఎగబాకిన 30 షేర్ల బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ చివరిగా 5.67 పాయింట్ల స్వల్పనష్టంతో 39,586.41 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 39.817.22 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 39,510.44 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 0.05 శాతం స్వల్ప నష్టంతో 11,841.55 పాయింట్ల వద్ద స్థినపడింది. ఈ సూచీ సైతం ఒక దశలో 11,911.15 పాయింట్ల గరిష్టాన్ని, తదుపరి 11,821.05 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో టెక్ మహేంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఆర్‌ఐఎల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, వేదాంత అత్యధికంగా 2.26 శాతం నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఓఎన్‌జీసీ, ఆక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, సన్‌పార్మా, హెచ్‌యూఎల్ 2.95 శాతం లాభపడ్డాయి. కాగా జూన్ నెలకు సంబంధించి ఫీచర్స్ అండ్ ఆఫ్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టుల కాలపరిమితి ముగియడంతో స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు నెలకొన్నాయని వ్యాపారులు తెలిపారు. జీ-20 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల ప్రభావంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దేశీయ మార్కెట్‌లో వాటాల కొనుగోలు జోరు సాగింది. ఐతే అమెరికాను హెచ్చరిస్తూ ఇరాన్ ప్రకటన జారీ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదరడంతో మధ్యాహ్నం తర్వాత మదుపర్ల వైఖరిలో మార్పు వచ్చిందని విశే్లషకులు భావిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు వాటాల విక్రయాలకు దిగడంతో చివరకు సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం స్వల్పంగా బలపడింది. 3పైసలు పెరిగి 69.11 రూపాయలుగా ట్రేడైంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.93 శాతం తగ్గి బ్యారెల్ 65.08 డాలర్లుగా ట్రేడైంది. ఇక విదేశీ మార్కెట్ల విషయానికి వస్తే షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను సంతరించుకున్నాయి. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతోనే సాగాయి.