బిజినెస్

మార్కెట్లకు భారీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 25: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే భయాలు వెంటాడుతుండడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆగస్టునెల డెరివేటివ్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం దాకా కూడా అదే బాటలో సాగాయి. అయితే మధ్యాస్నం తర్వాత ఐరోపా మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడం, అలాగే శుక్రవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ యెల్లెన్ మీడియా సమావేశం నేపథ్యంలో అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతాయేమోన్న భయాలతో అమ్మకాలు పెరిగిపోయి ప్రధాన సూచీలు నష్టాల బాటలో సాగాయి. ఫలితంగా ఒక దశలో 28,154 పాయింట్లను దాటిన సెనె్సక్స్ చివరికి 224 పాయింట్లు నష్టపోయి రెండు వారాల కనిష్టస్థాయి అయిన 27,835. 91 పాయింట్లవద్ద ముగిసింది. ఈ నెల 10వ తేదీ తర్వాత సెనె్సక్స్ ఒకే రోజు ఇంతగా పతనం కావడం ఇదే మొదటి సారి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 58 పాయింట్లు నష్టపోయి 8,592 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా లోహాలు, టెక్నాలజీ, ఐటి, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో,రియల్టీ రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి. మార్కెట్ హెవీ వెయిట్స్ అయిన అదానీ పోర్ట్స్, విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బిఐ, ఎన్‌టిపిసి, మహింద్ర అండ్ మహింద్ర 3నుంచి 1.4 శాతం దాకా నష్టపోయాయి. అయితే గెయిల్, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్‌లు మాత్రం లాభాలతో ముగిశాయి. మొత్తంమీద సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 25 షేర్లు నష్టపోగా, అయిదు మాత్రం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంనుంచే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.