బిజినెస్

స్విస్ బ్యాంక్‌ల ఖాతాల్లో భారత్ 74వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూరిచ్ / న్యూఢిల్లీ, జూన్ 30: స్విస్ బ్యాంకుల్లో భారీ ఎత్తున నగదును దాచేస్తున్న కుబేరుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే భారత్ మదుపరుల సంఖ్య కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో అత్యధిక లావాదేవీలు సాగిస్తున్న దేశాల్లో భారత్ స్థానం 74గా నమోదైంది.
గత సంవత్సరం 73వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక సంఖ్య తగ్గి 74వ స్థానంలోకి చేరింది. మొత్తంగా చూస్తే ఇంగ్లాండ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఈ వివరాలను అల్పిన్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ ఆదివారం విడుదల చేసింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ) గత సంవత్సరం విడుదల చేసిన గణాంకాల మేరకు.. అప్పటి వరకు 88వ స్థానంలో ఉన్న భారత్ 73వ స్థానంలోకి ఎగబాకింది. ప్రస్తుతం మరొక స్థానం తగ్గి 74వ స్థానంలోకి చేరింది. కాగా, స్విడ్జర్లాండ్‌లోని అన్ని బ్యాంకుల్లో భారత్‌కు చెందిన మదుపరుల సొమ్ము 0.07 శాతంగా నమోదైంది. స్విస్ బ్యాంకుల్లో పలు దేశాలు జాగ్రత్తగా దాచుకొంటున్న సొమ్ముతో పోలిస్తే భారత్‌కు చెందిన వివిధ సంస్థలతో పాటు ఖాతాదారులు దాచిన సొమ్ము చాలా తక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018 సంవత్సరం ఆఖరు నాటికి ఇంగ్లాండ్‌కు చెందిన కుబేరులు దాచిన సొమ్ము ఏకంగా 24 శాతంగా నమోదై మొదటి స్థానంలోకి చేరింది.
స్విస్ బ్యాంకుల్లో అత్యధిక శాతం నగదు నిల్వలను దాచిన టాప్ ఐదు దేశాల్లో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండో స్థానంలో, వెస్టిండీస్ మూడు, ఫ్రాన్స్ నాలుగు, హాంగ్‌కాంగ్ ఐదో స్థానంలో ఉన్నాయి. మొత్తం స్విస్ బ్యాంకుల్లో ఉన్న నగదుతో పోలిస్తే ఈ ఐదు దేశాలకు చెందిన డబ్బే 50 శాతం ఉండడం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో దాచిన నగదులో టాప్ పది దేశాలతో పోలిస్తే కేవలం ఈ ఐదు దేశాల నగదు నిల్వలే సరాసరి మూడింట రెండొంతులు ఉండడం విశేషం. స్విస్ బ్యాంకుల్లో దాచి ఉంచిన టాప్ 15 దేశాల నగదు నిల్వలు 75 శాతంగా గణాంకాలు చెబుతున్నాయి.
కాగా, టాప్ 10 దేశాల్లో పై ఐదు దేశాల తరువాత బహమాస్, జర్మనీ, లక్సంబర్గ్, కేమాన్ ఐలాండ్, స్విడ్జర్లాండ్ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ‘బ్రిక్స్’ దేశాల గణాంకాల వివరాలకొస్తే.. రష్యా 22వ స్థానంలో, సౌత్ ఆఫ్రికా 60 స్థానంలో, బ్రెజిల్ 65వ స్థానంలో ఉన్నాయి.
భారత్‌ను మించి స్విస్ బ్యాంకుల్లో అత్యధిక మొత్తంలో నగదు నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో మారిషస్ (71), న్యూజిలాండ్ (59), ఫిలిప్పీన్స్ (54), వెనిజులా (53), సీచెల్స్ (52), థాయ్‌లాండ్ (39) కెనడా (36), టర్కీ (30), ఇజ్రాయెల్ (28), సౌదీ అరేబియా (21), పనామా (18), జపాన్ (16), ఇటలీ (15), ఆస్ట్రేలియా (13), యూఏఈ (12)వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.