బిజినెస్

జీఎస్‌టీలో మరిన్ని సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఈ పరోక్ష పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలను ప్రకటించనుంది. కొత్త రిటర్న్ వ్యవస్థను ప్రవేశపెట్టడం, క్యాష్ లెడ్జర్ వ్యవస్థను హేతుబద్ధీకరించడం, ఒక సింగిల్ రిఫండ్-డిస్‌బర్సింగ్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఈ సంస్కరణల్లో ఉన్నాయి. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం నిర్వహించే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని, వివిధ శాఖలకు చెందిన కీలకమయిన కార్యదర్శులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థకు జీఎస్‌టీ అమలు అనేది ఒక ‘గేమ్ చేంజర్’ వంటిదని, సంక్లిష్టమయిన పరోక్ష పన్ను వ్యవస్థ స్థానంలో సరళతరమయిన, పారదర్శకమయిన, టెక్నాలజీ ఊతంతో నడిచే జీఎస్‌టీని ప్రవేశపెట్టడం జరిగిందని ఆ ప్రకటన పేర్కొంది. జీఎస్‌టీలో ఒక కొత్త రిటర్న్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కొత్త రిటర్న్ వ్యవస్థ జూలై ఒకటో తేదీ నుంచి ట్రయల్ ప్రాతిపదికన, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలవుతుందని వివరించింది. ‘చిన్న పన్ను చెల్లింపుదారులకు సహజ్ అండ్ సుగమ్ రిటర్న్స్‌ను ప్రతిపాదించడం జరిగింది’ అని పేర్కొంది. సింగిల్ క్యాష్ లెడ్జర్‌ను ప్రభుత్వం హేతుబద్ధీకరిస్తుందని, గతంలో ఉన్న 20 హెడ్స్‌ను అయిదు ప్రధాన హెడ్స్‌గా విలీనం చేయడం జరుగుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పన్ను, వడ్డీ, జరిమానా, రుసుము, ఇతర అంశాలకు కలిపి ఒకే క్యాష్ లెడ్జర్ ఉంటుందని వివరించింది. ఒక సింగిల్ రిఫండ్-డిస్‌బర్సింగ్ యంత్రాంగం అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.