బిజినెస్

ఈ వారంలోనే కేంద్ర బడ్జెట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ఈ వారంలోనే కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న తరుణంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆ దిశలో ప్రభావితం కానున్నాయి. ప్రధానంగా మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంభించనున్నారని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఒసాకోలో ముగిసిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా, చైనా ఏలా వివరిస్తాయన్న అంశం కూడా ఈ వాణిజ్య వారంలో మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధానాంశం కానుంది. ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం, రూపాయి మారకం విలువ, ముడిచమురు ధరల స్థితిగతులను సైతం మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ‘ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ఎలాంటి ఉత్కంఠను రేపాయో అలాగే ఈ వారంలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై సైతం స్టాక్ మార్కెట్ గణనీయంగా ప్రభావితం కానుందని, అందుకే ప్రస్తుతం తుపాను ముందటి ప్రశాంతతలా మార్కెట్ పరిస్థితి ఉంద’ని ప్రముఖ విశే్లషకుడు జిమీత్ మోదీ అభిప్రాయపడుతున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలూ లేకపోలేదని, అలాగే స్వల్పకాలానికి ప్రతికూలతలు కూడా నెలకొనవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి మదుపర్లంతా వేచిచూసే వైఖరిని అవలంభించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా సేవ, తయారీ రంగాలకు సంబంధించిన పీఎంఐ డేటాను ఈ వారం ప్రకటించనున్న విషయాన్ని సైతం పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గత బడ్జెట్‌లో సూచన ప్రాయంగా తెలియజేసిన విధంగానే కేంద్రం ఈ దఫా కూడా వార్షిక బడ్జెట్‌లోటును ఆమోద యోగ్యమైన స్థాయికి నియంత్రిస్తుందన్న అంచనాలున్నాయని, రాబోయే సంవత్సరాల స్థితిగతులను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుందని అందరూ భావిస్తున్నారని మరో విశే్లషకుడు వినోద్ నాయర్ అన్నారు. పెరిగిన ముడి సరకుల ధరలతోబాటు తగ్గిన డిమాండ్ కారణంగా వాహనాలు, లోహ రంగాల వృద్ధిరేటు తగ్గే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దేశ స్థూల వృద్ధిరేటును దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్ అంచనాలు తయారు చేయడం ప్రస్తుతానికి పెనుసవాలుగా మారగా ఈ విషయంపై ప్రస్తుతం అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. గడచిన శుక్రవారంతో ముగిసిన వాణిజ్య వారంలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 200.5 పాయింట్లు లాభపడి 39,394.64 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్ధిరపడింది.