బిజినెస్

రిజర్వు బ్యాంకు నియంత్రణ, పర్యవేక్షణాధికారాలు మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: రిజర్వు బ్యాంకుకు ఉన్న నియంత్రణాధికారాలను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ)పై ఉన్న పర్యవేక్షణాధికారాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక స్థితిగతులపై ఆర్బీఐ నిశితంగా అధ్యయనం చేస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. వీటి పనితీరును మెరుగుపరిచేందుకు కసరత్తు కొనసాగుతుందని, ఇందులోని ప్రధాన కంపెనీలను ఇతర రంగాలతో అనుసంధానం చేయడం ద్వారా సమర్థవంతంగా పనిచేసేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆమె తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక స్థితిని పెంచి స్థిరమైన వృద్ధి నెలకొనేలా చేయాల్సిందిగా సెంట్రల్ బ్యాంకును కోరామని, ఆ దిశలో ఆ బ్యాంకు తన విస్తృతాధికారాలను వినియోగిస్తుందని నిర్మల చెప్పారు. భారత రిజర్వు బ్యాంకు చట్టం 1934 ప్రకారం ఆర్బీఐకి ఉన్న నియంత్రణ, పర్యవేక్షణాధికారాలను మరింతగా బలోపేతం చేసే విషయమై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని, ప్రస్తుతం వాటి అమలు విషయంపై పరిశీలన జరుగుతోందని ఆమె మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్‌బీఎఫ్‌సీల అవసరాలకు అనుగుణంగా ఆర్థికాభివృద్ధి అంచనాల మేరకు కాలానుగుణంగా మూలధన పెంపునకు ప్రభుత్వం నిధులను సమకూరుస్తోందని ఆమె తెలిపారు. ఐతే ప్రైవేటు ఎన్‌బీఎఫ్‌సీల మూలధన పెంపునకు దోహదం చేసే చర్యలేవీ ప్రభుత్వ పరిశీలనలో లేవని నిర్మల స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ 23 వరకు ఆర్బీఐ వద్ద 9,643 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. 2018-19లో ఎన్‌ఎప్‌బీల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 6.6 శాతంగా ఉందని గత ఏడాది కంటే ఇది 5.3 శాతం అధికమని ఆమె తెలిపారు.