బిజినెస్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.9 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రుతుపవనాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం, కీలక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకడ లాంటి సానుకూల పరిణామాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం భారత దేశ ఆర్థిక వృద్ధి గత ఏడాదికన్నా ఎక్కువగా 7.9 శాతం ఉండవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయ పడింది. జిడిపి క్రమంగా మెరుగుపడుతుందని, పెద్దగా సానుకూల పరిస్థితులు లేని కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి కాస్త మందగించవచ్చని, 7.8 శాతమే ఉండవచ్చని ఆ సంస్థ అభిప్రాయ పడింది. ఇంతకు ముందు త్రైమాసికంలో జిడిపి వృద్ధి 7.9 శాతం ఉన్న విషయం తెలిసిందే. 2016-17 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి అందరూ ఇంతకు ముందు అంచనా వేసిన 7.5 శాతం, గత ఆర్థిక సంవత్సరం సాధించిన 7.6 శాతంకన్నా ఎక్కువగా 7.9 శాతం ఉంటుందని మేము భావిస్తున్నాం’ అని గోల్డ్‌మన్ సాచ్స్ ఇటీవలి పరిశోధనా పత్రంలో అభిప్రాయ పడింది. మెరుగైన రుతుపవనాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులవేతనాల పెంపు, సానుకూలమైన ద్రవ్య పరపతి విధానం, ఇటీవల కీలకమైన పన్ను సంస్కరణల చట్టాలను ఆమోదించడం, అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకడ కొనసాగుతుండడం లాంటి సానుకూల అంశాలు వృద్ధి రేటు పెరుగుదలకు మద్దతునివ్వనున్నాయని కూడా ఆ సంస్థ అభిప్రాయ పడింది.
అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనుకున్నదానికన్నా వేగంగా పెరగడం, చైనా వృద్ధి, పెట్టుబడుల రాకకు సంబంధించిన భయాలు భారత్ వృద్ధికి ప్రధానమైన రిస్క్‌లుగా ఉంటాయని అభిప్రాయ పడింది. అంతేకాకుండా దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు సమస్య మరింత తీవ్రం కావడం, లేదా రాబడి తగ్గిపోవడం లాంటి పరిణామాలు కూడా వృద్ధి రేటుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయ పడింది. గత రెండు నెలల్లో వస్తు సేవల పన్ను( జిఎస్‌టి) బిల్లు లాంటి పలు కీలక బిల్లులు ఆమోదం పొందడం, ఆర్‌బిఐ కొత్త గవర్నర్ నియామకంతో పాటుగా ద్రవ్యోల్బణం నియంత్రణకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ఆ సంస్థ హర్షం వ్యక్తం చేస్తూ, ఈ చర్యలు రాబోయే రోజుల్లో ఆర్థికాభివృద్ధికి సానుకూల అంశాలుగా మారుతాయని అభిప్రాయ పడింది.