బిజినెస్

వరుసగా రెండో రోజూ లాభాల్లో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 2: వరుసగా రెండో రోజైన మంగళవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల పరుగును కొనసాగించాయి. ప్రధానంగా చమురు, సహజ వాయువులు, ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ బాగా లాభపడడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు గురైన 30 షేర్ల సూచీ సెనె్సక్స్ చివరిగా 129.98 పాయింట్ల ఆధిక్యతతో 0.33 శాతం లాభపడి 39,816.48 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 39,838.49 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 39,499.19 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 44.70 పాయింట్ల ఆధిక్యతతో 0.38 శాతం లాభపడి 11,814.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, మారుతి, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ అత్యధికంగా 2.89 శాతం లాభపడ్డాయి. ఈ సూచీ పరిధిలో ఎస్ బ్యాంకు తీవ్రంగా 7.60 శాతం నష్టపోయింది. ఈ బ్యాంకు నుంచి 1,200 కోట్ల రుణం పొందిన ఓ ప్రైవేటు సంస్థ ఇందుకు సంబంధించిన వడ్డీల చెల్లించకుండా డీఫాల్టర్‌గా మారిందన్న వార్తలు వెలువడడంతో ఎస్ బ్యాంకుకు స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని విశే్లషకులు భావిస్తున్నారు. కాగా టాటా మోటార్స్, సన్‌పార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఆక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హీరోమోటోకార్ప్ సైతం 2.47 శాతం నష్టపోయాయి.
రూపాయి బలహీనం
కరెన్సీ స్థితిగతులను పరిశీలిస్తే అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ మంగళవారం 6 పైసలు తగ్గి ఇంట్రాడేలో 89.01 రూపాయలుగా ట్రేడైంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు థరల 0.22 శాతం తగ్గాయి. బ్యారెల్ 64.92 డాలర్లుగా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగియగా, ఐరోపా మార్కెట్ సూచీలు ఆరంభ ట్రేడింగ్‌లో సానుకూలంగా కదలాడాయి.