బిజినెస్

విశాఖ ఉక్కుకు స్వర్ణ కాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: బ్యాంకాక్‌లో నిర్వహించిన క్వాలిటీ సర్కిల్స్ పోటీల్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన క్వాలిటీ సర్కిల్స్ బంగారు పతకాలను సాధించాయి. అసోసియేన్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్‌కు సంబంధించి అంతర్జాతీయ కనె్వన్షన్‌ను ఈ నెల 23 నుంచి 26 వరకూ బ్యాంకాక్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో 3 క్యుసి టీమ్స్, రెండు కైజెన్ టీమ్స్ బంగారు పతకాలను సాధించి ఉక్కు ప్రతిష్ఠను మరింత ఇనుమడింపచేశారు. వైర్ రాడ్ మిల్‌కు సంబంధించి మోక్ష, పవర్ ఇంజనీరింగ్ మెయింటినెన్స్‌కు సంబంధించి తరుణ్, బ్లాస్ట్ ఫర్నెస్‌కు సంబంధించి సరళీకరణ్ క్యుసి టీమ్‌లు తమ కేస్ స్టడీస్‌ను అక్కడ వివరించారు. జిఎం వి.రామానుజన్, ఎజిఎం డాక్టర్ ఎస్‌బివిఎస్‌పి శాస్ర్తీ పర్యవేక్షించారు. మోక్ష టీమ్‌లో డి.మాధవరావు, అరుణ్ వెంకటరెడ్డి, పి.రాజు, సత్యారావు, జి.కుంచయ్య, ఎన్.త్రిమూర్తి, పి.నర్సింగరావు కలిసి మోడిఫికేషన్ ఆఫ్ ఫర్నేస్ డిశ్ఛార్జింగ్ సైడ్ డోర్స్ ఆపరేషన్‌పై ప్రజెంట్ చేశారు. తరుణ్ టీమ్ బి.రవివర్మ, మరుద్ర రావు, సిహెచ్.వి.సత్యనారాయణ, హరనాథ్, రమణ తదితరులు ఆయిల్ డ్రైన్ మోడిఫికేషన్ ఇన్ కోక్ ఒవెన్ ఎగ్జాస్టర్ మోటార్‌పై వివరించారు. సరళీకరణ్ టీమ్ పృథ్విరాజ్, శ్రీకాంత్, వర్మ, విష్ణుమూర్తి మోడిఫికేషన్ ఆఫ్ లిమిట్ యూనిట్ ఆఫ్ బెల్‌లెస్ టాప్ సెకండరీ ఈక్వలైజింగ్ వాల్వ్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్‌పై వివరించారు. వీరిని ఉక్కు సిఎండి పి.మధుసూదన్ అభినందించారు.

చిత్రాలు.. బంగారు పతకం సాధించిన ఉక్కు ఉద్యోగుల బృందం