బిజినెస్

ఏపిలో రేషన్ డీలర్ల కమీషన్ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని దశాబ్దాలుగా నామమాత్రపు కమిషన్‌తో కాలం వెళ్లదీస్తున్న 29 వేల మంది రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. క్వింటాలు గోధుములు, బియ్యానికి ప్రస్తుతం ఇస్తున్న 20 రూపాయల కమిషన్‌ను ఒకేసారి 70 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్ అఫిషియో సెక్రటరీ బి.రాజశేఖర్ బుధవారం సాయంత్రం 10వ నెంబర్‌తో జీవో విడుదల చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 కింద క్వింటాల్‌కు రూ. 87లు కమిషన్‌గా ఇవ్వాల్సి రాగా ఈపాస్, ఎన్‌రోల్‌మెంట్ మీషన్ల సరఫరా కోసం ప్రభుత్వం రూ. 17లు భరిస్తున్నందున రూ. 70లు కమిషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింద. డీలర్ల సమస్యలపై తాము అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత ఇతర మంత్రులను, ఎమ్మెల్యే టిడి జనార్ధన్ ద్వారా అనేక సార్లు కల్సిన మీదట ఈ జీవో జారీ అయిందని రేషన్ డీలర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు అంధ్రభూమితో అన్నారు. ఇక డీలర్లు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రతి నెల కనీసం రూ. 15 నుంచి 20 వేల ఆదాయం పొందే అవకాశముంటుందన్నారు. వాస్తవానికి అద్దెలు భరించలేకపోతున్నామని అయినా నిత్యం కార్డుదారుల తాకిడి ఉంటుందని అత్యధిక మంది చౌకడిపోల కోసం తమ ఇళ్లను అద్దెకు ఇవ్వటంలేదన్నారు. అందుకే ప్రభుత్వమే దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన షాపులు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. కమిషన్ పెంచినందులకు కృతజ్ఞతగా సెప్టెంబర్ మాసంలో రాష్ట్రంలోని డీలర్ల సమక్షంలో సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులకు భారీ ఎత్తున అభినందన సభ ఏర్పాటు చేయదలచామన్నారు.