బిజినెస్

లోక్‌పాల్‌కు వంద కోట్లకు పైగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అవినీతి నిరోధక వ్యవస్థ లోక్‌పాల్‌కు 100 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. సెంట్రల్ విజిలెన్స కమిషన్‌కు 35.55 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018-19 ఆర్థిక సంవత్సరం తాత్కాలిక బడ్జెట్‌లో లోక్‌పాల్‌కు కేటాయించిన 4.29 కోట్ల రూపాయల బడ్జెట్‌లో ఎలాంటి మార్పు లేదు. అవినీతి నిరోధక శాఖకు ఈ ఏడాది మార్చిలో చైర్‌పర్సన్, సభ్యుల నియామకం కూడా జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో లోక్‌పాల్‌కు 101.29 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులను దేశ రాజధానిలో ప్రత్యేక కార్యాలయంతోపాటు నిర్వహణ కోసం వెచ్చించనున్నారు.