బిజినెస్

వెనక్కి తగ్గిన మాన్‌శాంటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: జన్యు మార్పిడి చేసిన తదుపరి తరం పత్తి విత్తనాలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ మాన్‌శాంటో గురువారం వెల్లడించింది. నియమ నిబంధనలకు సంబంధించిన అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని ఆ సంస్థ పేర్కొంది. ‘బోల్‌గార్డ్-2 రౌండప్ రెడీ ఫ్లెక్స్ టెక్నాలజీ’ రకానికి చెందిన పత్తిని వాణిజ్యపరంగా సాగు చేసేందుకు పర్యావరణ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును జూలై 6వ తేదీన ఉపసంహరించుకున్నామని మాన్‌శాంటో సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము భారత్‌లో అమ్ముతున్న ఇతర రకాల పత్తి విత్తనాలపై ఈ నిర్ణయం ఎటువంటి దుష్ప్రభావం చూపబోదని ఆయన పేర్కొన్నారు.