బిజినెస్

వాట్సాప్ నెంబర్లు ఫేస్‌బుక్ చేతిలోకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రపంచంలోని ప్రముఖ మెసేజింగ్ సర్వీసుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ‘వాట్సాప్’ తన గ్లోబల్ ప్రైవసీ పాలసీని (అంతర్జాతీయ గోప్యతా విధానాన్ని) సవరించింది. దీని ప్రకారం ఆ సంస్థ ఇకమీదట తమ వినియోగదారుల ఫోన్ నెంబర్లను తన మాతృ సంస్థ అయిన ‘ఫేస్‌బుక్’కు షేర్ చేస్తుంది. ఫేస్‌బుక్ తన సొంత ప్లాట్‌ఫామ్ ద్వారా మరింత సంఖ్యలో నిర్ధేశిత అడ్వర్టైజ్‌మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని వాట్సాప్ ప్రతినిధి ఒకరు గురువారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే వాట్సాప్ మాత్రం ఇకముందు కూడా ఎటువంటి వాణిజ్య ప్రకటనలు లేకుండానే (యాడ్-ఫ్రీగానే) కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.