బిజినెస్

బీఈఎంఎల్‌లో వాటాల విక్రయానికి ముందస్తు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)లో 26 శాతం వాటాలను డిసినె్వస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా వెనక్కు తీసుకోదలుచుకున్నామన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో సమర్థించుకుంది. ఇందుకు సంబందించి అన్ని ముందస్తు చర్యలూ తీసుకోవడం జరిగిందని, ఇందులో జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య ఏదీ ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది. బీఈఎంఎల్‌లో ప్రభుత్వానికి 54.03 శాతం వాటాలున్నాయి. రక్షణ, రైల్వే, గనుల రంగాల నిర్వహణలో ఈ విభాగం కీలకంగా వ్యవహరిస్తుంది. ఈక్రమంలో రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ మంత్రి రంజిత్ సింగ్ సమాధానమిస్తూ ఈ డిజినె్వస్ట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల వ్యూహాత్మక విక్రయాలు నిర్థిష్ట విధానంతో జరిగాయని తెలిపారు. ‘ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తుల విక్రయాలు జరిపే సమయంలో వ్యూహాత్మక విక్రయాలకు సంబంధించి నీతీ ఆయోగ్ సిఫారసులను అనుసరించి చర్యలు చేపట్టడం అన్ని ప్రభుత్వాల బాధ్యత’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశానికి ఇక్కడ తావులేదని పేర్కొన్నారు. బీఈఎంఎల్‌కు అనేక విభాగాల్లో వ్యాపార వ్యవహారాలున్నాయని, ఇందులో రక్షణ శాఖకు సంబంధించి 16.16 శాతం మాత్రమే ఈ కంపెనీ భాగస్వామ్యం ఉందని, అలాగే రైల్ అండ్ నెట్‌వర్క్ వ్యాపారం 31.12 శాతం ఉందని, గనులు, నిర్మాణ రంగాల్లో 52.27 వాతం భాగస్వామ్యం ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఈప్రభుత్వ రంగ కంపెనీ నిర్వహణలో వందశాతం రక్షణ శాఖకు సంబంధించిన పనులున్నాయనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకే బీఈఎంఎల్‌లో కేంద్ర ప్రభుత్వ డిసినె్వస్ట్‌మెంట్ ప్రక్రియ జరిగిందన్నారు, బీఈఎంఎల్ ప్రైవేటీకరణకు కూడా ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. బీఈఎంఎల్ లిమిటెడ్‌లో ప్రభుత్వానికున్న 54.03 వాటాల్లో 26 శాతం వ్యూహాత్మక కొనుగొలుదారుకు అప్పగించేందుకు ప్రభుత్వానికి నిర్థిష్టమైన అనుమతులున్నాయన్నారు. ఈ డిజినె్వస్ట్‌మెంట్ ప్రక్రియ ద్వారా సంస్థ అన్ని విధాలా బలోపేతమై, పనితీరు పెరిగి ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీల జాబితాలోకి వస్తుందని మంత్రి రాజేంద్ర సింగ్ వివరించారు. రక్షణ రంగ తయారీ విభాగాల కంపెనీలను ప్రోత్సహించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని, ఈ డిజినె్వస్ట్‌మెంట్‌లో సైతం ఆవిషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు.