బిజినెస్

ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా పాత విమానాశ్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశంలో నిరుపయోగంగా ఉన్న కొన్ని విమానాశ్రయాలను ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు)గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విమానాలను లీజుకు ఇచ్చే సంస్థలు ఈ సెజ్‌లలో తమ విమానాలను పార్కింగ్ చేసుకుని ఖాతాదారులకు ప్రదర్శించేలా వీలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దీనితో పాటు దేశీయ విమానయాన రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విమానాల లీజు ధరలను తగ్గించేందుకు గల అవకాశాలను కూడా అనే్వషిస్తోందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్.చౌబే తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానతను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన నూతన పౌర విమానయాన విధానాన్ని ప్రకటించిన విషయం విదితమే. దేశంలో విమాన లీజు ధరలను తగ్గించడం ద్వారా ఈ విధానానికి మరింత ఊతం లభిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 400 విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని విమానాల పార్కింగ్‌కు, అలాగే పాత విమానాలను విచ్ఛిన్నం (బ్రేకింగ్ లేదా డిస్‌మాంట్లింగ్) చేసే కేంద్రాలుగానూ ఉపయోగించుకునేందుకు గల అవకాశాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ‘దేశంలో ప్రస్తుతం పలు విమానాశ్రయాలు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా ప్రకటించి ప్రపంచ వ్యాప్తంగా విమానాలను లీజుకు ఇచ్చే సంస్థలు అక్కడ తమ విమానాలను పార్కింగ్ చేసుకునేందుకు వీలు కల్పించడం సాధ్యమవుతుందా? అని కొంత మంది తనను అడిగారని చౌబే తెలిపారు.