బిజినెస్

వాస్తవిక ప్రణాళికతో బడ్జెట్ రూపకల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై వస్తున్న విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. బడ్జెట్‌లో పేర్కొన్న ప్రతిపాదనలన్నీ ప్రణాళికాబద్ధంగా, వాస్తవికతను ప్రతిబింబించేలా రూపొందించామని ఆమె శుక్రవారంనాడు పేర్కొన్నారు. యధార్థ అంశాలతో సమ్మిళితమైన బడ్జెట్‌లో వ్యవసాయం, పెట్టుబడులకు పెద్దపీట వేయడం ద్వారా రానున్న ఐదేళ్ల కాలంలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారు కావాలన్నదే తమ అభిమతమని రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా రక్షణ, పెన్షన్, జీతభత్యాలు, అంతర్గత భద్రత వంటి వాటికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయింపులు జరిగిన విషయాన్ని ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు పన్నుల రూపంలో, పన్నుయేతర వనరులను సమీకరించనున్నామని ఆమె తెలిపారు. బడ్జెట్‌లో చూపించిన అంశాలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా తయారు చేసినవేనని ఆమె అన్నారు. రాబోయే ఐదేళ్లలో తాము అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు పెట్టే విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 3ఇది ఒక ప్రణాళిక లేకుండా రూపొందించినది కాదు2 అని ఆమె వ్యాఖ్యానించారు. 2024-25 నాటికల్లా దేశ ఆర్థిక వ్యవస్థను ఇపుడున్న 2.7 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే తమ ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై ఎక్కువ దృష్టి సారించడంతోపాటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రానున్న రోజుల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయనున్నామని, 400 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌లను 25 శాతం పెంచనున్నామని ఆమె తెలిపారు. అదేవిధంగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశలో భాగంగా ఆయా వాహనాలకు పన్నులను మినహాయించనున్నామని, రిటైల్ వ్యాపారులు, గుమస్తాలకు స్వచ్ఛంద పెన్షన్‌ను పెంచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆమె తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వౌలిక వసతుల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నామని కేంద్ర మంత్రి సీతారామన్ వెల్లడించారు. 3మేకిన్ ఇండియా2ను బలపరచేందుకు వీలుగా దిగుమతి చేసుకునే కొన్నిరకాల ముడిసరకులపై పన్ను మినహాయింపు ఇవ్వనున్నామని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్లడానికి చేపడుతున్న చర్యల్లో భాగంగా రైతులకు నగదు సదుపాయాన్ని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పన్నుల వసూళ్లలో తమ ప్రభుత్వం లక్ష్యాన్ని చేరుకోలేదని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఇన్‌కంట్యాక్స్, ఎక్సయిజ్, జీఎస్‌టీ వసూళ్లలో లక్ష్యాలను అధిగమించిన విషయాన్ని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారి అధికారంలో వచ్చిన సందర్భంగా చేపట్టిన 16 సంస్కరణల గురించి ఆమె సోదాహరణంగా సభలో వివరించారు. అదేవిధంగా ఈ ఏడాది జూలై 5న ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఉపాధి గ్యారంటీ పథకం, నీటిపారుదల, గ్రామీణ రోడ్లు, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పంటల బీమా, మధ్యాహ్న భోజనం తదితర 99 పథకాలకు నిధులు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ అవి సాధారణ పౌరుల అభివృద్ధికి ఎంతగానో మేలు చేకూరుస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం...రాజ్యసభలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్